ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

UAE అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ కన్నుమూత

ABN, First Publish Date - 2022-05-13T23:11:10+05:30

యునైట్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు, అబుదాబి ఎమిరేట్స్ పాలకుడు కూడా అయిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు, అబుదాబి ఎమిరేట్స్ పాలకుడు కూడా అయిన  షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (Sheikh Khalifa bin Zayed Al Nahyan) కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఆ దేశ వార్తా సంస్థ డబ్ల్యూఏఎం తెలిపింది.


రాజ్యాంగం ప్రకారం.. ఏడు ఎమిరేట్స్ దేశాలు 30 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అప్పటివవరకు వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (Sheikh Mohammed bin Rashid al-Maktoum) అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

 

1948లో జన్మించిన ఖలీఫా 2004లో అత్యంత ధనిక ఎమిరేట్ అబుదాబిలో అధికారంలోకి వచ్చి దేశాధినేత అయ్యారు. ఇప్పుడాయన సవతి సోదరుడు, క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబి తదుపరి పాలకుడు అయ్యే అవకాశం ఉంది.


షేక్‌ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఖలీఫా మృతి నేపథ్యంలో ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వశాఖలతో పాటు ప్రైవేటు రంగంలోనూ దాదాపు 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. అలాగే, మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!