ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నేటినుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు

ABN, First Publish Date - 2022-05-04T13:36:42+05:30

శాసనసభ సమావేశాలు నాలుగు రోజుల సెలవుల అనంతరం బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 6 నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రతిరోజు వివిధ ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెరంబూర్‌(చెన్నై): శాసనసభ సమావేశాలు నాలుగు రోజుల సెలవుల అనంతరం బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 6 నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రతిరోజు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఆర్థిక పద్దులపై చర్చలు జరుగుతుండగా, ఆయా శాఖల మంత్రులు కొత్త పథకాలు ప్రకటించారు. గత నెల 29వ తేది ఆరోగ్యశాఖ పద్దుపై చర్చ జరిగింది. అనంతరం శని, ఆదివారాలు, రంజాన్‌ పండుగ సందర్భంగా శాసనసభకు నాలుగు రోజులు సెలవు  ప్రకటించారు. బుధవారం ప్రారంభం కానున్న సమావేశంలో హిందూ దేవాదాయ శాఖ, సమాచార సాంకేతిక శాఖలకు సంబంధించిన ఆర్థిక పద్దులు, ప్రతిపాదనలపై చర్చలు జరుగనున్నాయి.. 6న ఆదిద్రావిడులు, గిరిజన సంక్షేమ శాఖ, 7న ప్రణాళిక, అభివృద్ధి, సాధారణ ప్రాజెక్ట్‌ల అమలు, ఆర్ధిక, మానవవనరుల శాఖల పద్దుపై చర్చ జరుగనుంది. 9,10 రెండు రోజులు పోలీసు శాఖపై చర్చ జరుగనుంది. అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, ఎక్సైజ్‌, హోంశాఖ తదితరాలకు సంబంధించిన చర్చ కూడా ఈ రెండు రోజులు జరుగనుంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం నుంచి జరిగే సమావేశాలకు సంబంధించిన ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. కాగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరాలు, హత్యలు, చైన్‌ స్నాచింగ్‌లు అధికమయ్యాయంటూ ప్రతిపక్ష అన్నాడీఎంకే శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయనుండగా, అందుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సీఎం సన్నద్ధులయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!