ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సొమ్ము ఇప్పించడంపైనే తొలి దృష్టి

ABN, First Publish Date - 2022-05-13T09:30:54+05:30

ఆర్థిక నేరాల కేసుల్లో మోసానికి గురైన వారికి డబ్బులు ఇప్పించడంపైనే దర్యాప్తు సంస్థలకు ప్రాథమిక దృష్టి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆర్థిక నేరాల కేసులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య 

నౌహీర షేక్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక నేరాల కేసుల్లో మోసానికి గురైన వారికి డబ్బులు ఇప్పించడంపైనే దర్యాప్తు సంస్థలకు ప్రాథమిక దృష్టి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితులను జైల్లో పెట్టించడంపై  కాకుండా బాధితులకు సొమ్ములు అందేలా కృషి చేయాలని సూచించింది. నిందితులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం తర్వాతి దశ కిందికి వస్తుందని పేర్కొంది. జనాల నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేసిన హీరా గోల్డ్‌ కంపెనీ అధినేత నౌహీరా షేక్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీ్‌స(ఎ్‌సఎ్‌ఫఐవో) దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధించింది. ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయడంపై ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజుకు సూచించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!