‘పేరరివాలన్’పై రాష్ట్రపతిదే తుది నిర్ణయం: కేంద్రం
ABN, First Publish Date - 2022-05-14T08:20:08+05:30
‘పేరరివాలన్’పై రాష్ట్రపతిదే తుది నిర్ణయం: కేంద్రం
చెన్నై, మే 13 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టిన కేసుల్లో, రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల రాజీవ్ హత్య కేసు దోషి పేరరివాలన్ విడుదలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికే ఉంటుందని సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. ఈ మేరకు శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. తనను ఇకనైనా విడుదల చేయాలన్న పేరరివాలన్ సుప్రీంను కోరారు. దీంతో సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం తన లిఖితపూర్వక అభిప్రాయాన్ని వెల్లడించింది.