కశ్మీరీ పండిట్ రాహుల్‌ను చంపిన ఉగ్రవాదులు హతం!
ABN, First Publish Date - 2022-05-14T08:14:49+05:30
జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని, కశ్మీర్ పండిట్ రాహుల్ భట్‌పై కాల్పులు జరిపి హత్య చేసింది ఆ ఉగ్రవాదులేనని భావిస్తున్నామని
ముగ్గురిని హతమార్చినట్లు డీజీపీ వెల్లడి
శ్రీనగర్, మే 13: జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని, కశ్మీర్ పండిట్ రాహుల్ భట్‌పై కాల్పులు జరిపి హత్య చేసింది ఆ ఉగ్రవాదులేనని భావిస్తున్నామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఓ జాతీయ మీడియాకు తెలిపా రు. బుడ్గాం జిల్లా చదూరా గ్రామంలోని తహసీల్దారు కార్యాలయంలోకి గురువారం చొరబడిన ఉగ్రవాదులు రాహుల్ భట్(35) అనే కశ్మీరీ పండిట్‌పై కాల్పులు జరి పి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యపై జ మ్మూకశ్మీర్‌లోని బుడ్గాంలో శుక్రవారం కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. శ్రీనగర్ విమానాశ్రయం వైపునకు వారు నిరసన ప్రదర్శనగా వెళ్లసాగారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కాగా, కశ్మీరీ పండిట్ల నిరసనకు మద్ద తు తెలిపేందుకు వెళ్లాలనుకున్న తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. నిరసన ప్రదర్శనకు దిగిన కశ్మీరీ పండిట్లను అణచివేయాలనుకోవడం సిగ్గుచేటని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. తన భర్తను చంపేందుకు తోటి ఉద్యోగులే ఉగ్రవాదులతో చేతులు కలిపి కుట్ర పన్ని ఉండొచ్చని రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్, తండ్రి బిట్టా భట్ ఆరోపించారు. రాహుల్ భట్ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జమ్మూకశ్మీర్ అధికారులు తెలిపారు. రాహుల్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.