నీట్‌-పీజీ వాయిదాకు సుప్రీంకోర్టు తిరస్కృతి

ABN , First Publish Date - 2022-05-14T08:19:04+05:30 IST

నీట్‌-పీజీ 2022 పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నీట్‌-పీజీ వాయిదాకు సుప్రీంకోర్టు తిరస్కృతి

న్యూఢిల్లీ, మే 13: నీట్‌-పీజీ 2022 పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. పరీక్షలు వాయిదా వేస్తే వైద్యుల కొరత ఏర్పడి, రోగుల సంరక్షణకు ఇబ్బంది కలుగుతుందని వ్యాఖ్యానించింది. పరీక్షలు కావాలని 2.06 లక్షల మంది అభ్యర్థులు కోరుకుంటున్నారని, వారి ప్రయోజనాలను విస్మరించలేమని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం పేర్కొంది. ఈ సమయంలో పరీక్షలు వాయిదా వేస్తే అనిశ్చితి, గందరగోళం నెలకొంటుందని తెలిపింది. దాంతో తొలుత నిర్ణయించిన మేరకు ఈ నెల 21న పరీక్షలు జరగనున్నాయి. 

Read more