కాంగ్రెస్‌కు Sunil jakhar రాజీనామా

ABN , First Publish Date - 2022-05-14T19:35:09+05:30 IST

ఓవైపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై "చింతన్ శివిర్'' నిర్వహిస్తుండగా మరోవైపు ఆ పార్టీకి సీనియర్ నేత..

కాంగ్రెస్‌కు Sunil jakhar రాజీనామా

న్యూఢిల్లీ: ఓవైపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై "చింతన్ శివిర్'' (Chintan Shivir) నిర్వహిస్తుండగా మరోవైపు ఆ పార్టీకి సీనియర్ నేత, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ (Sunil Jakhar) షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి శనివారంనాడు రాజీనామా (Resign) చేశారు. ఫేస్‌బుక్‌లో 'దిల్ కీ బాత్' స్ట్రీమ్‌లో తన రాజీనామా ప్రకటన చేశారు. ''గుడ్ లక్...గుడ్ బై కాంగ్రెస్'' అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ పంజాబ్ యూనిట్ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తప్పించి నవజ్యోత్ సింగ్ సిద్ధూను పీపీసీసీ చీఫ్‌గా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో సిద్ధూ  సైతం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొద్దికాలంగా సునీల్ జాఖర్ పరోక్షంగా కాంగ్రెస్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ  వస్తున్నారు. పార్టీకి ఆయన ఉద్వాసన చెప్పే అవకాశాలున్నాయనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

Read more