ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Onlineలో పరోటా ఆర్డర్... కూతురు తినేసింది.. తల్లితినబోతుండగా పాము చర్మం..

ABN, First Publish Date - 2022-05-09T21:49:04+05:30

తిరువనంతపురం : కొన్ని రెస్టారెంట్లు పరిశుభ్రత విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఈ కారణంగా జనాల్లో విశ్వసనీయతను కోల్పోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిరువనంతపురం : కొన్ని రెస్టారెంట్లు పరిశుభ్రత విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తూ జనాల్లో విశ్వసనీయతను కోల్పోతున్నాయి. ఇదేకోవకు చెందిన కేరళలోని ఓ రెస్టారెంట్ నిర్వాకం కస్టమర్లకు వణుకు పుట్టించేలా ఉంది. తిరువనంతపురానికి చెందిన ప్రియ.. ఆన్‌లైన్‌లో పరోటా ఆర్డర్ ఇచ్చారు. అనుకున్న సమయానికే పార్శిల్ ఇంటికి చేరడంతో ప్రియా ముందుగా తన కూతురికి వడ్డించింది. కూతురు తినేయడంతో తానూ ఓ ప్లేట్లో పరోటా పెట్టుకుంది. తినబోడుతుంగా పరోటా చుట్టిన పేపర్లో ఏదో కొత్తగా కనిపించింది. నిశితంగా పరిశీలించగా అది పాము చర్మం. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురయ్యింది. గజ్జున వణికిపోయింది. పాము చర్మం పొడవు వేలులో సగమంత ఉంది. అప్పటికే ఆమె కూతురు తినడంతో ఆమెకు గుండెల్లో వణుకుపుట్టింది.


గత గురువారం జరిగిన ఈ ఘటనపై బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు ఆమెకు సూచించారు. దీంతో వెంటనే అధికారులను సంప్రదించింది. నెడుమంగడ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ నుంచి ఈ పరోటాలు వచ్చాయని మునిసిపల్ అధికారులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో అక్కడ వంటలు చేస్తున్నారని గుర్తించారు. తనిఖీల అనంతరం తక్షణమే రెస్టారెంట్‌ను మూసివేశారు.


నెడుమంగడ్ ఫుడ్ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్ స్పందిస్తూ.. పరోటా ప్యాకింగ్‌కు ఉపయోగించిన న్యూస్‌పేపర్‌లో పాము చర్మం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వివరించారు. పరోటాలు పాము చర్మానికి అంటుకున్నాయని వెల్లడించారు. రెస్టారెంట్ కిచెన్‌లో సరైన వెలుగులేదని చెప్పారు. రెస్టారెంట్ వెలుపల చెత్తకుప్పలు ఉన్నాయని అక్కడి అపరిశుభ్ర పరిస్థితులను వెల్లడించారు. రెస్టారెంట్ లైసెన్స్‌ను రద్దు చేశామని, యజమానులకు షోకాజ్ నోటీసులు తొలగించామని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!