ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Bear Attack: ముగ్గురిపై దాడిచేసిన ఎలుగుబంటి.. చిల్లింగ్ వీడియో ఇదిగో!

ABN, First Publish Date - 2022-11-07T11:52:59+05:30

ఓ ఎలుగుబంటి (bear) ముగ్గురిపై దాడిచేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తమిళనాడు (tamil nadu)లోని టెంకాశి జిల్లాలో ఓ ఎలుగుబంటి (bear) ముగ్గురిపై దాడిచేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరుథిలింగపురం గ్రామానికి చెందిన వైగుండమణి మసాలా పొట్లాలు తీసుకుని బైక్‌పై శివశైలం నుంచి పెథన్‌పిల్లై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వైగుండమణి దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో పక్కనే ఉన్న పొదల్లో నుంచి భల్లూకం ఒక్కసారిగా అతడిపైకి దూకి దాడిచేసింది.

వైగుండమణిని కింద పడేసిన ఎలుగు అతడిని ఇష్టం వచ్చినట్టు కొరికింది. గమనించిన ఆ దారిన వెళ్లేవారు, సమీప గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని గట్టిగా అరుస్తూ ఎలుగును వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అది వైగుండమణిని వదలకుండా కొరుకుతూనే ఉంది. ఆ తర్వాత దానిపైకి రాళ్లు విసరడంతో మణిని వదిలిపెట్టి వారిపైకి లంఘించి మరో ఇద్దరు.. నాగేంద్రన్, శైలేంద్రలపై దాడిచేసి పరారైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ ఎలుగుబంటిని బంధించారు. కాగా, బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2022-11-07T11:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!