పంజాబ్ సీఎం Bhagwant Mannను కలుసుకోనున్న sidhu
ABN , First Publish Date - 2022-05-09T01:49:28+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ...

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann)ను ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot singh Sidhu) సోమవారంనాడు కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని సిద్ధూ ఓ ట్వీట్లో తెలియజేశారు. "పంజాబ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను సోమవారం సాయంత్రం 5.15 గంటలకు కలుసుకుంటున్నాను. నిజాయితీతో కూడిన సమష్టి కృషితోనే పంజాబ్ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం సాధ్యమవుతుంది'' అని సిద్ధూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, ఆప్ అధికారంలోకి రావడంతో అధిష్ఠానం ఆదేశాలతో సిద్ధూ తన పిపీసీసీ చీఫ్ పదవికి ఇటీవల రాజీనామా చేశారు.