ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మర్యాదగా చెబుతున్నా.. వెనక్కి పోరా..!

ABN, First Publish Date - 2022-05-07T16:53:59+05:30

‘మర్యాదగా చెబుతున్నా వెనక్కి పోరా.. నీకు ముందుగానే చెప్పాను... స్టేషన్‌లో ఎలా చేరుతావ్‌‘ అంటూ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను అధికార బీజేపీ ఎమ్మెల్యే బెదిరించిన సంఘటన రాష్ట్రమంతటా

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 - వద్దని చెప్పినా స్టేషన్లో ఎలా చేరుతావ్‌

 - ఎస్‌ఐపై బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి చిందులు


బెంగళూరు: ‘మర్యాదగా చెబుతున్నా వెనక్కి పోరా.. నీకు ముందుగానే చెప్పాను... స్టేషన్‌లో ఎలా చేరుతావ్‌‘ అంటూ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను అధికార బీజేపీ ఎమ్మెల్యే బెదిరించిన సంఘటన రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. చిక్కమగళూరు తాలూకా మల్లందూరు పోలీస్ స్టేషన్‌కు సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పో స్టింగ్‌ మేరకు రవీష్‌ వచ్చి జాయిన్‌ అయ్యారు. ఆ తర్వాత ఎస్‌ఐ నేరుగా చిక్కమగళూరు జిల్లా మూడిగెరె ఎమ్మెల్యే కుమారస్వామికి ఫోన్‌ చేశారు. ఒక్కసారిగా ఆవేశంతో ఎమ్మెల్యే రెచ్చిపోయి ఏకవచనంతో ఎస్‌ఐని దూషించారు. ఇందుకు సంబంధంచిన ఆడియోలు శుక్రవారం వైరల్‌ అయ్యాయి. ఎమ్మెల్యేతో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రవీష్‌ సర్‌ నేను ఎస్‌ఐను మాట్లాడుతున్నానంటూ చెప్పిన వెంటనే ఎమ్మెల్యే ఎక్కడున్నావ్‌, స్టేషన్‌కు రావద్దని చెప్పానుగా ఎలా వస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐజీ సర్‌ ఫోన్‌చేసి జాయిన్‌ కావాలని సూచించారని వివరిస్తుండగానే మరోసారి ఎమ్మెల్యే వాపస్‌ వెళ్లు, మర్యాదగా వాపస్‌ వెళ్ళిపో స్టేషన్‌లో ఉండరాదంటూ హుకుం జారీ చేశారు. అంతలోనే మరింత ఆగ్రహంతో మర్యాదగా వాపస్‌ పోరా అంటూ విరుచుకుపడ్డారు. తాను చెప్పేదంతా కావాలంటే రికార్డు చేసుకో అంటూ రెచ్చిపోయారు. లేదు సార్‌ రేపు వచ్చి మిమ్ములను కలుస్తానని చెబుతుండగానే మర్యాదగా చెబుతున్నా వాపస్‌ వెళ్లిపో లేదంటే రేపటిలోగా బదిలీ చేయిస్తా అన్నారు. ఎంత లంచం ఇచ్చావ్‌... ఐజీకి ఎంతిచ్చావ్‌.. ఎవరెవిరికి ఎంతెంత ఇచ్చావో నాకు తెలియదా అంటూ మండిపడ్డారు. అటువంటిదేం లేదని ఎస్‌ఐ చెబుతుండగాననే మూడిగెరెకు ఐజీ లేదు ఇంకోరు లేదు అంతా నేనే అని తెలుసుకో అన్నారు. ఐజీకి జరిగింది చెప్పు అంటూ తీవ్రంగా మందలించారు. ఎమ్మెల్యే, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మధ్య జరిగిన సంభాషణ ఆడియోలు వైరల్‌ అయ్యాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!