Indoreభవనంలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం...ఏడుగురి సజీవ దహనం
ABN , First Publish Date - 2022-05-07T14:57:42+05:30 IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఓ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు....

ఇండోర్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఓ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.ఇండోర్ జిల్లాలోని స్వర్న్ బాగ్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నట్లు సంఘటన స్థలంలో ఉన్న ఇండోర్ పోలీసు కమిషనర్ హరినారాయణ్ చారి చెప్పారు.భవనంలో 16 మంది మంటల్లో చిక్కుకోగా ఏడుగురు సజీవ దహనమయ్యారు.
మరో 9మంది వ్యక్తులను ప్రమాదం నుంచి రక్షించామని పోలీసు కమిషనర్ చారి చెప్పారు.మంటల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాదం శనివారం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల సమయంలో జరిగిందని పోలీసులు చెప్పారు. అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేశారు.