ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Congress నేతలకు Sonia Gandhi కీలక సందేశం

ABN, First Publish Date - 2022-05-10T00:58:35+05:30

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మే 13 - 15 మధ్య నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సు (Chintan Shivir)కు 3 రోజుల ముందు CWC (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) కీలక భేటీ సోమవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మే 13 - 15 మధ్య నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సు (Chintan Shivir)కు 3 రోజుల ముందు CWC (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) కీలక భేటీ సోమవారం జరిగింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీతోపాటు సీడబ్ల్యూసీ నేతలు పాల్గొన్నారు. మేథోమధన సదస్సు విధివిధానాలు, అజెండాపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వేదికలపై ఆత్మవిమర్శ జరగాల్సిన అవసరం ఉందని నేతలకు సూచించారు. ఆత్మవిమర్శ అనేది ఆత్మవిశ్వాసం,  నైతికత దెబ్బతిసేలా ఉండకూడదు. నిరాశాజనక వాతావరణాన్ని సృష్టించేలా ఉండకూడదని పార్టీ నేతలకు సూచించారు. మే 13, 14, 15 తేదీల్లో ఉదయ్‌పూర్‌లో మేథోమధనం జరుగుతుందని మరోసారి సోనియా గుర్తుచేశారు. 400 మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. భాగస్వాముల్లో అత్యధికులు పార్టీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తున్న లేదా గతంలో నిర్వహించినవారు పాల్గొంటారు. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారు కూడా పాల్గొంటారని వెల్లడించారు. సమతుల్య ప్రాతినిధ్యం ఉండేందుకు చర్యలు తీసుకున్నామని, అన్నీ కోణాల్లోనూ సమప్రాధాన్యత ఉంటుందని సోనియా గాంధీ చెప్పారు.


ఆరు బృందాలుగా మేథోమధన చర్చలు జరుగుతాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత, వ్యవస్థీకృత సమస్యలపై సంప్రదింపులు జరుగుతాయని ఆమె వివరించారు. ఏ బృంద చర్చల్లో పాల్గొనాలనుకుంటున్నారో అంశంపై ఇప్పటికే ప్రతినిధులకు సమాచారం అందిందన్నారు. మే 15న మధ్యాహ్నం సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాత ఉదయ్‌పూర్ నవ్ సంకల్పాన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందని ఆమె వివరించారు. 


కాగా మీడియా రిపోర్టుల ప్రకారం.. 1998, 2003, 2013లలో కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సులు నిర్వహించింది. ఇందులో 2003 సెషన్ మాత్రమే కాంగ్రెస్‌కు ఎక్కువ ఉపయోగపడింది. నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకోవడంలో తోడ్పడింది. 10 ఏళ్లపాటు కాంగ్రెస్ పాలన నడిచింది. అయితే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటములను చవిచూస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో 53 సీట్లు, రాజ్యసభలో కేవలం 29 సీట్లు మాత్రమే మిగిలాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో దారుణమైన ఓటములను చవిచూసింది. అయితే రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో తిరిగి పుంజుకోవాలని సంకల్పించుకుంది. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఉదయ్‌పూర్ మేథోమధన సదస్సుకు సన్నద్ధమవుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!