ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Bal Thackeray పాత వీడియోను ట్వీట్ చేసిన Raj Thackery

ABN, First Publish Date - 2022-05-04T21:15:29+05:30

మసీదులపై లౌడ్‌స్పీకర్లకు సంబంధించి తన అంకుల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తండ్రి బాల్ థాకరే ఒకప్పుడు ఏమి చెప్పారో..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: మసీదులపై లౌడ్‌స్పీకర్లకు సంబంధించి తన అంకుల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తండ్రి బాల్ థాకరే ఒకప్పుడు ఏమి చెప్పారో తెలియజేసే ఒక పాత వీడియో క్లిప్‌ను MNS Chief  రాజ్‌థాకరే బుధవారంనాడు ట్వీట్ చేశారు. చట్టవిరుద్ధంగా మహారాష్ట్రలోని మసీదుల వద్ద ఉన్న లౌడ్‌స్పీకర్లు తొలగించాలంటూ ప్రభుత్వానికి రాజ్‌థాకరే ఇచ్చిన డెడ్‌లైన్ మంగళవారంతో ముగిసింది. మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లు తొలగించకుంటే మే 4వ తేదీ నుంచి మసీదుల బయట బిగ్గరగా హనుమాన్ చాలీసా పఠనం చేస్తామని కూడా Raj thackery ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో లౌడ్‌స్పీకర్ల వ్యవహారంపై శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఒకప్పుడు ఏమి మాట్లాడారో తెలియజేసే వీడియో క్లిప్‌ను రాజ్ ట్వీట్ చేశారు.


''మహారాష్ట్రలో నా (శివసేన) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నమాజ్ ప్రార్థనలు ఆపేంత వరకూ విశ్రమించేది లేదు. మతం అనేది దేశ ప్రగతికి అవరోధం కాకూడదు. మతం ఒక nuisanceగా ప్రజలు అనుకోరాదు. ఒకవేళ మన హిందూ మతం ఎవరికైనా న్యూసెన్స్ అనిపిస్తే ప్రజలు నాకు తెలియజేయాలి. అప్పుడు ఆ వ్యవహారాన్ని నేను స్వయంగా చూసుకుంటాను. మసీదులపై ఉన్న లౌడ్‌స్పీకర్లను తప్పనిసరిగా తొలగించాలి'' అని బాల్‌థాకరే మరాఠీలో మాట్లాడుతున్నట్టు ఆ  వీడియో క్లిప్‌లో ఉంది. ఈ వీడియో క్లిప్ నిడివి 36 సెకండ్లు ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!