ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Rahul Gandhi: ఈమె పెళ్లికే రాహుల్ గాంధీ పనిగట్టుకుని నేపాల్ వెళ్లింది.. ఈమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-05-05T01:01:42+05:30

ఒక యువతి పెళ్లికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నేపాల్‌కు వెళ్లారు. రాహుల్ గాంధీ అంత ప్రాధాన్యం ఇచ్చి..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత Rahul Gandhi నేపాల్ పర్యటన, అక్కడ ఓ నైట్ క్లబ్‌లో ఆయన విలాసవంతంగా గడుపుతున్నట్లు బయటకు వచ్చిన దృశ్యాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఖాట్మండులో రాహుల్ గాంధీ తమ నైట్‌క్లబ్‌కు వచ్చి పార్టీలో పాల్గొన్న విషయం వాస్తవమేనని Lord of the Drinks అనే ఆ నైట్ క్లబ్ ధ్రువీకరిస్తూ తాజాగా ప్రకటన చేసింది. వ్యక్తిగత పర్యటనలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకునే వ్యక్తి నైట్ క్లబ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నాడని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ఐదు రోజుల వ్యక్తిగత పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం ఖాట్మండు వెళ్లారు. ఒక యువతి పెళ్లికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నేపాల్‌కు వెళ్లారు. రాహుల్ గాంధీ అంత ప్రాధాన్యం ఇచ్చి ఆమె పెళ్లికి పనిగట్టుకుని వెళ్లారంటే ఆమె ఎవరని నెటిజన్లు వెతుకులాట సాగిస్తున్నారు.



ఆమె పేరు Sumnima Udas. జర్నలిస్ట్‌గా పనిచేసిన ఆమె రాహుల్‌కు స్నేహితురాలు. న్యూఢిల్లీలో ఆమె సీఎన్‌ఎన్ కరస్పాండెంట్‌గా ఆమె గతంలో పనిచేశారు. రాజకీయం, ఆర్థిక వ్యవహారాలు, సామాజిక సమస్యలను ఆమె తన వృత్తి ధర్మంలో భాగంగా కవర్ చేశారు. 2001 నుంచి 2017 వరకూ ఆమె సీఎన్‌ఎన్ కోసం జర్నలిస్ట్‌గా పనిచేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్నో ప్రముఖ అంశాలపై ఆమె రిపోర్టింగ్ చేశారు. 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన మొదలుకుని 2014లో జరిగిన ఢిల్లీ సాధారణ ఎన్నికల వరకూ ఎన్నో కీలక పరిణామాలను జర్నలిస్ట్‌గా ఆమె కవర్ చేశారు. 2012లో ఆమె జర్నలిస్ట్‌గా అవార్డ్ కూడా అందుకున్నారు. లింగ వివక్ష సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు మార్చి 2014లో ఆమెకు ‘Journalist of the Year’ అవార్డ్ దక్కింది. అమెరికాలోని Lee Universityలో ఆమె జర్నలిజం డిగ్రీ చేశారు. Oxford Universityలో ఆమె Master’s పూర్తి చేశారు. నేపాల్‌లోని Lumbini Museum వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉదాస్ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. నేపాల్ అంబాసిడర్ భీమ్ ఉదాస్ కూతురే ఈ Sumnima Udas. ఈమె వివాహానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందింది.


సుమ్నిమా దాస్ నేపాల్‌కు చెందిన పారిశ్రామికవేత్త నిమ మర్లిన్ షెర్పాన్‌ను పెళ్లాడారు. మే 5న వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది. ఈ రిసెప్షన్‌కు కూడా హాజరు కావడం కోసం రాహుల్ గాంధీ ఖాట్మండులోని Marriott Hotel లో బస చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేపాల్‌కు Sumnima Udas పెళ్లికి హాజరయ్యేందుకు రాహుల్ వెళ్లాడని తెలియగానే.. ఒక యాంటీ-ఇండియన్ పెళ్లికి రాహుల్ గాంధీ వెళ్లాడని బీజేపీ తప్పుబడుతోంది. భారత్‌లోని ఉత్తరాఖండ్‌ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను నేపాల్‌ తమవిగా చెప్పుకుంటోందని, Sumnima Udas కూడా నేపాల్ వాదనకు మద్దతు తెలుపుతోందని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తి వివాహానికి రాహుల్ గాంధీ హాజరయ్యారని, చైనా నుంచి నేపాల్ వరకూ భారత ప్రాదేశిక సమగ్రతను సవాల్ చేసే వ్యక్తులతోనే రాహుల్ ఎందుకు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని బీజేపీ ప్రశ్నించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!