ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

BJP నేత తజిందర్ బగ్గాపై పంజాబ్ కోర్టు అరెస్ట్ వారంట్

ABN, First Publish Date - 2022-05-08T00:45:03+05:30

భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జాతీయ కార్యదర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గాపై పంజాబ్‌లో నమోదైన కేసులో అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఆయనను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అత్యంత ఆసక్తికర పరిణామాలు జరిగాయి. తాజాగా శనివారం ఆయనను అరెస్టు చేసేందుకు పంజాబ్‌లోని మొహాలీ కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది. 


మొహాలీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సున్నీ సింగ్ అహ్లూవాలియా ఫిర్యాదు మేరకు తజిందర్ బగ్గాపై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 153ఏ, 505, 505(2), 506 ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. ఆయనను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచాలని Mohali Cyber Crime Branchను జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. 


బగ్గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, శత్రుత్వాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలు చేశారని, నేరపూరితంగా బెదిరించారని అహ్లూవాలియా ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు శుక్రవారం న్యూఢిల్లీలోని జనక్‌పురిలో నివసిస్తున్న బగ్గా ఇంటికి వెళ్ళారు. ఆయనను అరెస్టు చేసి, పంజాబ్ తీసుకెళ్తుండగా, ఢిల్లీ పోలీసులు ఓ కేసును నమోదు చేశారు. బగ్గాను పంజాబ్ పోలీసులు అపహరించి తీసుకెళ్తున్నారని జనక్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం బగ్గాను తీసుకెళ్తున్న  పంజాబ్ పోలీసులను   హర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుని, ఆయనను ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఢిల్లీ పోలీసులు ఆయనను శుక్రవారం పొద్దు పోయాక మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరిచారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!