ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Srilanka: బడులు, వ్యాపారాలను నిలివేస్తున్న నిరసనలు

ABN, First Publish Date - 2022-05-06T23:24:15+05:30

Srilanka ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు పతాక స్థాయికి చేరుతున్నాయి. దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ పాఠశాలలు, వ్యాపారాలను కొనసాగనివ్వకుండా నిరసనకారులు మూసివేస్తున్నారు. Government..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కొలంబో: Srilanka ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు పతాక స్థాయికి చేరుతున్నాయి. దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ పాఠశాలలు, వ్యాపారాలను కొనసాగనివ్వకుండా నిరసనకారులు నిలిపివేస్తున్నారు. Government, Private రంగాల్లో పని చేస్తున్న Workers అంతా తమ విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటున్నారు. President Gotabaya Rajapaksa రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.


Friday దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో Commercial Shops, Schools మూతపడ్డాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా అనేక కార్యకలాపాలు ఆగిపోయాయి. నిరసనల నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్సెపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ తాను పదవి నుంచి దిగేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ప్రజలంతా ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఈ సమయంలో సైతం తాము ప్రజా విశ్వాసంతో అధికారంలోకి వచ్చామని, పదవి నుంచి దిగిపోయేది లేదని చెప్తుండడం గమనార్హం.


శ్రీలంక ఖజానాలో విదేశీ నిధులు అడుగంటాయి. ప్రస్తుతం ఉపయోగానికి కేవలం 50 Million Dollors మాత్రమే అందుబాటులో ఉన్న ఆ దేశ ఆర్థిక మంత్రి గత వారం తెలిపారు. ఆహారం, ఇంధనం దిగుమతి చేసుకోవడం అత్యంత కష్టంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొలంబోలోని main train station ను సైతం మూసేశారు. సమీపంలోని terminal నుంచి రైళ్లను నడుపుతున్నారు. దేశంలో రవాణా వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే నడుస్తోంది. రోడ్లన్నీ నిరసనతలో నిండిపోతున్నాయి. విద్యార్థులు యూనివర్సిటీలు వదిలేసి రోడ్లెక్కుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!