ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Srilanka: Politicians ఇళ్లకు నిప్పు.. నిరసనకారులపై shoot-at-site orders

ABN, First Publish Date - 2022-05-11T17:19:25+05:30

కరునెగదలలో ఉన్న ప్రధాని రాజపక్స నివాసానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. అంతే కాకుండా డీఏ రాజపక్స విగ్రహాన్ని బాంబు పేల్చి కూల్చేశారు. శ్రీలంక వ్యాప్తంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రాజధాని కొలంబోలో పెద్ద ఎత్తున సైనికులను మోహరించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కొలంబో: ప్రభుత్వంపై తీవ్రంగా విసిగెత్తిపోయిన శ్రీలంకేయులు రాజకీయ నేతల ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. ప్రధాని ఇంటితో సహా Ministers, MPs ఎవరి ఇంటినీ వదిలి పెట్టడం లేదు. నేతల ఆస్తులను తమ ఆగ్రహ జ్వాలలకు ఆహుతి చేస్తున్నారు. దీంతో నిరసనకారులు కనిపిస్తే కాల్చిపారేయండంటూ శ్రీలంక Ministry of Defence ఆదేశాలు జారీ చేసింది. Prime Minister Mahinda Rajapaksa సోమవారం రాజీనామా చేశారు. అనంతరం రాజపక్సె మద్దతుదారులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. అది చిలికి చిలికి ఇంత వరకు వచ్చింది.


కరునెగదలలో ఉన్న ప్రధాని రాజపక్స నివాసానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. అంతే కాకుండా డీఏ రాజపక్స విగ్రహాన్ని బాంబు పేల్చి కూల్చేశారు. శ్రీలంక వ్యాప్తంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రాజధాని కొలంబోలో పెద్ద ఎత్తున సైనికులను మోహరించింది. అయితే రాజపక్సతో పాటు ఇతర రాజకీయ నేతలు ఇండియాకు పారిపోనున్నారనే వార్తలు శ్రీలంకలో ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై స్పందించిన శ్రీలంకలోని Indian High Commission.. అవన్నీ తప్పుడు ప్రచారాలని మంగళవారం స్పష్టం చేసింది. అయితే ప్రధాని రాజపక్స ఇప్పటికే Trincomalee లోని naval base లోకి పారిపోయారని వార్తలు వస్తున్నాయి.


శ్రీలంకలో రోడ్లపై, వీధుల్లో ఎక్కడ చూసినా నిరసనకారులే కనిపిస్తున్నారు. రాజకీయ నేతలు కనిపిస్తే దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు, జర్నలిస్టులను కూడా వదలడం లేదు. రాజకీయ నేతల ఇళ్లల్లోకి చొరబడి వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను తగలబెడుతున్నారు. రాజపక్స సహా ఇతర రాజకీయ నేతలు ఎవరూ దేశం విడిచి పారిపోకుండా నిరసనకారులు కొలంబో విమానాశ్రయానికి ముందు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా, అల్లర్లను ఆపేయాలని, శాంతిని పాటించాలని శ్రీలంక ప్రజలకు అధ్యక్షుడు గొటబయ రాజపక్స మంగళవారం విజ్ణప్తి చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!