విదేశీ వస్తువుల బానిసత్వం నుంచి బయటపడండి : Narendra Modi

ABN , First Publish Date - 2022-05-06T21:47:41+05:30 IST

విదేశీ వస్తువుల పట్ల బానిసత్వ వైఖరిని విడనాడాలని, Indiaలో

విదేశీ వస్తువుల బానిసత్వం నుంచి బయటపడండి : Narendra Modi

న్యూఢిల్లీ : విదేశీ వస్తువుల పట్ల బానిసత్వ వైఖరిని విడనాడాలని, Indiaలో తయారైన వస్తువులను స్వీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. 


జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన JITO Connet 2022 బిజినెస్ మీట్‌ను వీడియో లింక్ ద్వారా శుక్రవారం ప్రారంభించిన అనgతరం మోదీ మాట్లాడుతూ, నేడు మన దేశం సాధ్యమైనంత వరకు ప్రతిభ, వ్యాపారం, సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. భారత దేశంలో start-up culture పెరిగిందన్నారు. మన దేశంలో ప్రతి రోజూ డజన్లకొద్దీ స్టార్టప్ కంపెనీలు నమోదవుతున్నాయన్నారు. వారానికి ఓ యూనికార్న్ ఏర్పడుతోందని చెప్పారు. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్నారు. ఎగుమతుల కోసం నూతన అవకాశాలను గుర్తించాలని కోరారు. ఈ అంశాలపై స్థానిక మార్కెట్లలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఉత్పత్తుల్లో లోపాలు ఉండకూడదని, పర్యావరణంపై ఎంతమాత్రం ప్రభావం చూపకూడదని చెప్పారు. 


స్వయం సమృద్ధ భారత దేశం కోసమే తన ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇది దృఢ సంకల్పమని చెప్పారు. ప్రభుత్వ ప్రక్రియలు పారదర్శకంగా మారాయన్నారు. ప్రభుత్వానికి దృఢ నిశ్చయం, ప్రజల మద్దతు ఉంటే మార్పు అనివార్యమని తెలిపారు. 


JITO  యువ సభ్యులు సృజనశీలురని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని, ప్రకృతి సేద్యంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. శూన్య వ్యయ బడ్జెట్‌తో ప్రకృతి సేద్యంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, సాగు సాంకేతిక పరిజ్ఞానం, సర్క్యులర్ ఎకానమీలలో మదుపు చేయాలని చెప్పారు. రీసైకిలింగ్, పునర్వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య సంరక్షణలపై దృష్టి సారించాలన్నారు. 


ప్రభుత్వానికి సంబంధించిన GeM e-marketplace పోర్టల్‌లో దాదాపు 40 లక్షల మంది రిజిస్టర్ చేయించుకున్నారని, ఈ పోర్టల్‌ను అధ్యయనం చేయాలని JITO ప్రతినిధులను కోరారు. దీనిలో రిజిస్టర్ చేయించుకున్నవారిలో అత్యధికులు స్వయం సహాయక బృందాలు, చిన్నతరహా, మధ్య తరహా వ్యాపారవేత్తలేనని చెప్పారు. ఈ కొత్త విధానంపై ప్రజలకు నమ్మకం ఉందని చెప్పారు. మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నవారు, చిన్న దుకాణదారులు, స్వయంసహాయక బృందాలు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించవచ్చునని తెలిపారు. 


ప్రపంచం ఎంతో నమ్మకంతో, ఎన్నో ఆశలతో భారత దేశం వైపు చూస్తోందన్నారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమని చెప్పారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళకు సంబంధించిన పరిష్కారాలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల బలోపేతం వంటివాటి కోసం భారత దేశం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచం ఆమోదిస్తోందని చెప్పారు. 


Read more