ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఓ పాక్ యువతిని సోదరుడే తుపాకీతో కాల్చిచంపాడు.. కారణం తెలిస్తే..

ABN, First Publish Date - 2022-05-07T01:59:58+05:30

లాహోర్ : పాకిస్తాన్‌లో సాంప్రదాయక ముస్లిం కుటుంబాలు అధికంగా ఉంటాయి. అక్కడ ఆడపిల్లలు ఎన్నో ఆంక్షల మధ్య ఎదగాల్సి ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

లాహోర్ : పాకిస్తాన్‌లో సాంప్రదాయక ముస్లిం కుటుంబాలు అధికంగా ఉంటాయి. అక్కడ ఆడపిల్లలు ఎన్నో కట్టుబాట్ల మధ్య ఎదగాల్సి ఉంటుంది. స్త్రీల స్వేచ్ఛను ఎన్నో సవాళ్లు చుట్టుముట్టివుంటాయి. వీటన్నింటినీ అధిగమించి తనకెంతో ఇష్టమైన డ్యాన్సింగ్, మోడలింగ్‌ను కెరియర్‌గా ఎంచుకున్న ఓ యువతిని తోబుట్టువే కడతేర్చాడు. విషాదకరమైన ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వెలుగుచూసింది. లాహోర్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెనలా ఖుర్డ్ ఒకారా ప్రాంతానికి చెందిన సిద్రా వయసు 22 సంవత్సరాలు. ఓ స్థానిక బ్రాండ్‌కి మోడల్‌గా పనిచేస్తోంది. అంతేకాకుండా తన కుటుంబ అభీష్టానికి విరుద్ధంగా ఫైసలాబాద్ సిటీలోని థియేటర్లలో డ్యాన్స్‌లు చేయడమే ఆమె చేసిన నేరమైందని ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలిపారు. 


ఈ వృత్తిని మానుకోవాలని సిద్రాపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. కుటుంబ సాంప్రదాయాలకు విరుద్ధమని వారించారు. ఇవేమీ పట్టించుకోకుండా తనకు ఎంతో ఇష్టమైన రంగంలో రాణించాలని భావించిన సిద్రా ముందుకే అడుగేసింది. అయితే రంజాన్ వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని భావించింది. గతవారం ఫైసలాబాద్ నుంచి ఇంటికి చేరుకుంది. అయితే అసభ్యకరమైన వృత్తిలో కొనసాగుతున్నావంటూ తల్లిదండ్రులు, సోదరుడు హంజా వాగ్వాదానికి దిగారు. డ్యాన్స్ చేయబోనని మాటివ్వాలని ఆమెను తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో సోదరుడు హంజా తుపాకీతో సిద్రాను తలపై కాల్చాడు. స్పాట్‌లోనే ఆమె చనిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు హంజాపై మర్డర్ కేసు నమోదుచేశామని పోలీసులు చెప్పారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు.


సిద్రా డ్యాన్స్ చేస్తున్న వీడియోను బంధువు ఒకరు హంజాకి ఫోన్ ద్వారా పంపించారు. వీడియో చూసిన హంజా తీవ్ర ఆవేశానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. కాగా ఇదే తరహాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 19 ఏళ్ల మహిళ డ్యాన్సర్ అయేషాను తన మాజీ భర్త తుపాకీతో కాల్చిచంపాడు. కాగా పరువు హత్యలు పాకిస్తాన్‌లో నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరువు హత్య జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!