ఇంటి నుంచి బహిష్కరించబడ్డ వారి గురించి మాట్లాడను: Raj Thackeray పై Owaisi
ABN , First Publish Date - 2022-05-13T17:53:18+05:30 IST
సొంత ఇంటి నుంచి బహిష్కరణకు గురైన వారి గురించి తాను మాట్లాడబోనని Raj Thackeray పై Akbaruddin Owaisi తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో loudspeaker వివాదం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ వివాదానికి తెరలేపిన రాజ్..

ముంబై: సొంత ఇంటి నుంచి బహిష్కరణకు గురైన వారి గురించి తాను మాట్లాడబోనని Raj Thackeray పై Akbaruddin Owaisi తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో loudspeaker వివాదం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ వివాదానికి తెరలేపిన రాజ్ థాకరేపై పేరు ప్రస్తావించుకుండా ఆయన విమర్శలు గుప్పించారు. గురువారం ఔరంగాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ తామెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘నేను ఎవరినీ చెడ్డొల్లుగా చూపించడానికి ఇక్కడి రాలేదు. కనీసమైనా తెలుసుకోవాలని అనుకోలేని వారికి, కనీస గుర్తింపు పొందే అర్హతలేని వారికి మనమెందుకు సమాధానం చెప్పాలి? సొంత ఇంట్లో నుంచే బహిష్కరించబడ్డ వ్యక్తుల గురించి ఏం చెప్పాలి? మనం దేనికీ భయపడాల్సిన అవసరం లేదు’’ అని అక్బరుద్దీన్ అన్నారు. హైదరాబద్ లోక్‌సభ స్థానం నుంచి మాత్రమే ఇన్నాళ్లు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్ ఎంఐఎం.. మొదటిసారిగా ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గాన్ని 2019 ఎన్నికల్లో గెలుచుకుంది. ఇదే కాకుండా ముంబైలో రెండు ఎమ్మెల్యే స్థానాలను సైతం గెలుచుకుంది.