ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆలస్యంగా వచ్చారని విమానం ఎక్కనివ్వని Air india సిబ్బంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-05-12T02:31:38+05:30

న్యూఢిల్లీ : ఆలస్యంగా వచ్చిన ఓ ప్రయాణికురాలని Air india సిబ్బంది విమానం ఎక్కనివ్వలేదు. బోర్డింగ్ గేట్ వద్ద సిబ్బంది అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : ఆలస్యంగా వచ్చిన ఓ ప్రయాణికురాలని Air india సిబ్బంది విమానం ఎక్కనివ్వలేదు. బోర్డింగ్ గేట్ వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయిన బాధిత Passenger ఫ్లోర్‌పై పడిపోయింది. గుండె, డయాబెటిక్ రోగి అయిన బాధిత మహిళ విషయంలో ఎయిరిండియా సిబ్బంది కనికరం చూపలేదని ఆమెతోపాటే ప్రయాణించాల్సిన ఇద్దరు సభ్యులు చెప్పారు. మెడికల్ సాయం అందించలేదని ఆరోపించారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేశారు.  విజువల్స్ ప్రకారం.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ బోర్డింగ్ గేట్ల వద్ద ఓ మధ్యవయస్కురాలు ఫ్లో‌ర్‌పై పడివుంది. శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. కాగా ఈ అంశం న్యూస్‌ ప్లాట్‌ఫామ్స్‌తోపాటు సోషల్ మీడియా వేదికలపై చక్కర్లు కొట్టడంతో ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వీడియో తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. డాక్టర్, సీఐఎస్‌ఎఫ్ అధికారికి తక్షణమే సమాచారం అందించామని వివరణ ఇచ్చింది.


వాస్తవాలు తెలుసుకోకుండా ఎయిరిండియా ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోంది. బోర్డింగ్ గేట్లు మూసివేయడానికి ముందు కూడా ఆ ముగ్గురు ప్రయాణికులను పిలుస్తూనే ఉన్నాం. అయినా వారెవరూ రాలేదు. ఇక ప్రయాణికురాలు ఫ్లోర్‌పై పడిందని గుర్తించిన వెంటనే డాక్టర్, సీఐఎస్ఎఫ్‌కు సమాచారం అందించామని వెల్లడించింది. అయితే డాక్టర్ వచ్చేసరికే ప్రయాణికురాలు కుదుటపడ్డారు. మెడికల్ సహాయం లేదా వీల్‌చైర్ అవసరంలేదని ఆమె చెప్పారు. ప్రయాణికుల భద్రత, సౌలభ్యానికే ఎయిరిండియా ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. సమయానుగుణంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుందని స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి సరైన సమాచారం అందిందనే భావిస్తున్నామని పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!