రాత్రుళ్లు కస్టడీ విచారణ వద్దు: Dgp

ABN , First Publish Date - 2022-05-04T15:12:54+05:30 IST

పోలీస్ స్టేషన్లలో విచారణ ఖైదీలను రాత్రివేళల్లో విచారణ జరుపకూడదంటూ డీజీపీ శైలేంద్రబాబు మౌఖిక ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల చెన్నై, తిరువణ్ణామలై పోలీస్ స్టేషన్లలో విచారణ

రాత్రుళ్లు కస్టడీ విచారణ వద్దు: Dgp

పెరంబూర్‌(చెన్నై): పోలీస్ స్టేషన్లలో విచారణ ఖైదీలను రాత్రివేళల్లో విచారణ జరుపకూడదంటూ డీజీపీ శైలేంద్రబాబు మౌఖిక ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల చెన్నై, తిరువణ్ణామలై పోలీస్ స్టేషన్లలో విచారణ ఖైదీలు అనుమానాస్సద స్థితిలో మృతిచెందిన సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో శాసనసభ సమావేశాల్లో ఈ నెల 9, 10 తేదీల్లో పోలీసు శాఖ ఆర్థిక పద్దులపై చర్చ జరుగనుంది. ఈ నేపథ్యంలో విచారణ ఖైదీలను సాయంత్రం 6 గంటల్లోపేు జైలుకు తరలించాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ మౌఖిక ఉత్తర్వులు జారీచేశారు.

Read more