ఇద్దరు రౌడీల దారుణ హత్య
ABN , First Publish Date - 2022-05-10T16:16:51+05:30 IST
తిరువళ్లూరు జిల్లా పొన్నేరి, మీంజూరు ప్రాంతాల్లో పేరుమోసిన ఇద్దరు రౌడీలను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మీంజూరు సమీపం వయలూరులో

చెన్నై: తిరువళ్లూరు జిల్లా పొన్నేరి, మీంజూరు ప్రాంతాల్లో పేరుమోసిన ఇద్దరు రౌడీలను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మీంజూరు సమీపం వయలూరులో బార్ నడుపుతున్న రౌడీ మూర్తి (40)పై పలు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. సోమవారం ఉదయం మూర్తి తన బార్ వద్ద పనిచేస్తుండగా గుర్తు తెలియని ఏడుగురు వేటకొడవళ్లతో వచ్చి ఆయనపై దాడి చేశారు. మూర్తి అక్కడి కక్కడే చనిపోయాడు. బార్‌ను నడిపే విషయమై వయలూరుకు చెందిన ఓ వ్యక్తికి, మూర్తికి మధ్య పాత తగాదాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుం దని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదేవిధంగా పొన్నేరి వెంబాక్కం ప్రాంతంలో జవహర్ (31) అనే రౌడీ తన అనుచరుడు సీనాతో కలిసి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. జవహర్‌కు మరో రౌడీకి మధ్య పాతతగాదాలు ఉన్నాయని, ఆ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.