ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Mebhooba Mufti గృహ నిర్బంధం

ABN, First Publish Date - 2022-05-13T19:30:02+05:30

బుద్గాం జిల్లా పర్యటనకు బయలుదేరడానికి ముందే తనను ప్రభుత్వాధికారులు గృహనిర్బంధం..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

శ్రీనగర్: బుద్గాం జిల్లా పర్యటనకు బయలుదేరడానికి ముందే తనను ప్రభుత్వాధికారులు గృహనిర్బంధం చేశారని పీడీపీ అధక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి Mehbooba Mufti ముఫ్తీ శుక్రవారం తెలిపారు. Budgam జిల్లా ఛదూర ప్రాంతంలో Kashmir pandit ఒకరని అతని కార్యాలయం వద్దే ఉగ్రవాదులు గురువారం కాల్చిచంపిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కశ్మీర్ పండిట్ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు తాను బుద్గాం వెళ్లాలనుకున్నానని, అయితే తనను శ్రీనగర్ నివాసం నుంచి బయటకు అధికారులు వెళ్లనీయలేదని మెహబూబా ముఫ్తీ తాజాగా ట్వీట్ చేశారు. కశ్మీర్ పండిట్లకు రక్షణ కల్పించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.


దీనికి ముందు గురువారంనాడు ఒక ట్వీట్‌లో కశ్మీర్ పండిట్ హత్యను మెహబూబా ముఫ్తీ ఖండించారు. ''మరో జీవితం బలైపోయింది. మరో కుటుబం అతలాకుతలమైంది. బాధిత కుటుంబ సభ్యులను తలుచుకుని నా మనసెంతో ఆవేదనతో నిండిపోయింది. కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితి నెలకొందనే తప్పుడు వాదనల్లో నిజం లేదని రుజువైంది'' అని ఆమె అన్నారు. కాగా, ఉగ్రవాదుల చేతులో హతమైన కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ అంత్యక్రియలను జమ్మూ కశ్మీర్ పండిట్ల నిరసనలు, ఆందోళనల మధ్య నిర్వహించారు. భట్‌కు 2011-12లో మైగ్రెంట్ స్పెషల్ ఎంప్లాయిమెంట్ ప్యాకేజీ కింద గుమాస్తా ఉద్యోగం లభించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!