ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేని ధార్మిక సంస్థలకు నోటీసులు

ABN, First Publish Date - 2022-05-11T17:45:55+05:30

రాష్ట్ర వ్యాప్తంగా లౌడ్‌స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి పొందని ధార్మిక సంస్థలకు నోటీసులు జారీ చేసేందుకు హోం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. లౌడ్‌స్పీకర్ల విషయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా లౌడ్‌స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి పొందని ధార్మిక సంస్థలకు నోటీసులు జారీ చేసేందుకు హోం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. లౌడ్‌స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సూచించిన నేపథ్యంలో రాజధాని బెంగళూరు సహా మైసూరు, తుమకూరు, శివమొగ్గ, దావణగెరె, కోలారు, మంగళూరు, బెళగావి, కలబురగి, బళ్లారితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 121 దేవాలయాలు, 83 మసీదులు, 22 చర్చిలు, మరికొన్ని ఇతరత్రా కలిపి మొత్తం 301 ధార్మిక సంస్థలకు నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటితోపాటు పెద్దపెద్ద శబ్ధం వచ్చే సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న బార్లకు కూడా నోటీసులు జారీ చేయనున్నారు. ప్రార్థనా మందిరాలు ఏ మతానికి చెందినవైనా సరే అనుమతులు లేకుండా లౌడ్‌స్పీకర్లు ఉన్నచోట నిర్ధాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ ప్రవీణ్‌సూద్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు వేర్వేరు డెసిబల్స్‌ ప్రమాణాలను ప్రార్థనామందిరాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని, అనుమతి ఉన్న లౌడ్‌స్పీకర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని డీజీపీ ప్రవీణ్‌సూద్‌ మీడియాకు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!