ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కర్ణాటక PSI రిక్రూట్‌మెంట్ Scam : 125కిపైగా మార్కులు వచ్చినవారిపై సీఐడీ దృష్టి

ABN, First Publish Date - 2022-05-06T23:37:33+05:30

బెంగళూరు : కర్ణాటక పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్( PSI ) రిక్రూట్‌మెంట్ Scam లో ఆ రాష్ట్ర CID దర్యాప్తు మరింత ముమ్మరమైంది. 125కి పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులపై సీఐడీ దృష్టిసారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బెంగళూరు : Karnataka పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్( PSI ) రిక్రూట్‌మెంట్ Scam లో ఆ రాష్ట్ర CID దర్యాప్తు మరింత ముమ్మరమైంది. 125కి పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులపై సీఐడీ దృష్టిసారించింది. ఆబ్జెక్టివ్ పరీక్షలో 150 మార్కులకిగానూ 125కిపైగా మార్కులు పొందిన 32 మంది అభ్యర్థులను గుర్తించినట్టు తెలిపింది. వీరి ఓఎంఆర్(ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్) షీట్లను ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా జవాబులు దిద్దిన విధానం ఒకేలా ఉందని అధికారులు వెల్లడించారు. మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడినవారు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని కర్ణాటక పోలీస్ వర్గాలు వెల్లడించాయి.


కాగా కర్ణాటకలో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కాం గత నెల ఏప్రిల్‌లో వెలుగుచూసింది. ఎగ్జామ్‌లో పెద్ద ఎత్తున మాల్‌ప్రాక్టీస్ జరిగిందని కటాఫ్ అర్హత సాధించలేకపోయిన కొందరు అభ్యర్థులు రాష్ట్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. తమకు తెలిసిన ఓ వ్యక్తి కేవలం 21 ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అన్నీ సరైన సమాధానాలే అయినా అతడికి 31.5 మార్కులు రావాల్సి ఉంటుంది. కానీ అతడికి 121 మార్కులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హోంమంత్రి ఆదేశాలతో సీఐడీ కేసు నమోదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇన్విజిలేటర్ల సహాయంతో పరీక్షా కేంద్రం వద్దే ఓఎంఆర్ షీట్లను నింపారని దర్యాప్తులో తేలింది. కాగా బెంగళూరు, కలబుర్గిలలో ఎగ్జామ్‌ రాసిన 25 మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 3, 2021న జరిగిన ఎగ్జామ్‌లో ఆబ్జెక్టివ్ విభాగంలో 125కిపైగా మార్కులు తెచ్చుకున్న 18 మందిని ఇదివరకే గుర్తించినట్టు సీఐడీ వెల్లడించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!