ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Ips Ravindranath రాజీనామా కలకలం

ABN, First Publish Date - 2022-05-12T17:25:18+05:30

రాష్ట్ర పోలీస్‌ శిక్షణ విభాగ డీజీపీ డాక్టర్‌ పీ రవీంద్రనాథ్‌ రాజీనామాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలు సూచించారు. డీసీఆర్‌ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                  - ఆమోదించవద్దని ప్రభుత్వానికి ప్రతిపక్షాల సూచన 


బెంగళూరు: రాష్ట్ర పోలీస్‌ శిక్షణ విభాగ డీజీపీ డాక్టర్‌ పీ రవీంద్రనాథ్‌ రాజీనామాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలు సూచించారు. డీసీఆర్‌ఈ డీజీపీగా ఉన్న రవీంద్రనాథ్‌ను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పీ రవికుమార్‌కు లేఖను సచివాలయంలో స్వయంగా సమర్పించడంతో కలకలం చెలరేగింది. నకిలీ కులధ్రువీకరణ పత్రాల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడ్డ కారణంగానే తనను వేధించేందుకు ప్రాధాన్యత లేని శాఖకు బదిలీచేశారని రవీంద్రనాథ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాజీనామా కొత్తదేమీ కాదు. పదోన్నతి లభించలేదన్న కారణంగా మనస్తాపానికి గురై 2008లో ఒకసారి 2014లో మరోసారి, 2020లోనూతన పదవికి రాజీనామా చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేసే నిజాయితీ పరులైన అధికారులను వేధించడం సరికాదని జేడీఎస్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు. అత్యంత నిజాయితీగా పనిచేస్తున్న ఈ దళిత అధికారి ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన సౌకర్యాలను నకిలీ సర్టిఫికెట్లతో ఇతరులు తన్నుకుపోతుండంపై నిఘా విధించి చర్యలు తీసుకున్నారని, ఇందుకు అభినందించాల్సిన ప్రభుత్వం బదిలీవేటుతో శిక్ష వేయడం అత్యంత విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి పలు ఘటనలతో అక్రమాలకు నెలవుగా మారిన పోలీస్‌ శాఖ ప్రతిష్ట రవీంద్రనాథ్‌ రాజీనామాతో మరింత మసకబారిందన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కుట్ర జరిగిందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బెంగళూరులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర హోంశాఖ పూర్తిగా దారితప్పిందన్నారు. ఇటీవలి పరిణామాలన్నీ ఈ శాఖ మర్యాదను మంటగలిపేలా ఉన్నాయన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!