ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆంధ్రప్రదేశ్, ఒడిశా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు...IMD warning

ABN, First Publish Date - 2022-05-07T14:08:03+05:30

తుపాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా కోస్తా జిల్లాల్లో ఈ నెల 10వతేదీ వరకు భారీవర్షాలు కురవవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

భువనేశ్వర్ : తుపాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా కోస్తా జిల్లాల్లో ఈ నెల 10వతేదీ వరకు భారీవర్షాలు కురవవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. శుక్రవారం దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో విస్తరించి అల్పపీడనంగా మారింది.ఈ అల్పపీడనం మే 8 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వాయువ్య దిశగా కదులుతూ రానున్న 12 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి ఆదివారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉంది.తుపాన్ వల్ల వచ్చే వారం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలు, తూర్పు కోస్తా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


ఈ తుపాన్ మే 10న తీరం చేరే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.శుక్రవారం మధ్య గంగా పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయని వాతావరణ కార్యాలయం తెలిపింది.వచ్చే ఐదు రోజుల్లో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్-సిక్కిం,ఒడిశాలలో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 10వ తేదీన ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. మే 9 నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున తూర్పు తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ అధికారి మోహపాత్రా హెచ్చరించారు. 




తుపాన్ వల్ల సముద్రంలో 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు. ఒడిశాలో ఐఎండీ అధికారులు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.విపత్తు సంభవించినప్పుడు సముద్రంలో మత్స్యకారుల కదలికలపై నిఘా ఉంచేందుకు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్‌లను అప్రమత్తం చేసినట్లు జెనా చెప్పారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!