ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

హోంమంత్రి రాజీనామా చేయాలి

ABN, First Publish Date - 2022-05-05T17:17:34+05:30

ఎస్‌ఐ పరీక్షల అక్రమాల వ్యవహారంలో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్న కారణంగా విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర రాజీనామా చేయాలని కాంగ్రెస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- ఎస్‌ఐ పరీక్షల అక్రమాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి

- కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన


బెంగళూరు: ఎస్‌ఐ పరీక్షల అక్రమాల వ్యవహారంలో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్న కారణంగా విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్ కు చెందిన పలు విభాగాల ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసనలో కేపీసీసీ కార్యాధ్యక్షుడు రామలింగారెడ్డి, విధానపరిషత్‌ ప్రతిపక్షనేత బీకే హరిప్రసాద్‌ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడినవారంతా అధికార పార్టీకి చెందినవారు కావడంతో వారిని రక్షించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇలాంటి ఆరోపణలు వెలుగు చూసినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పనికిమాలిన అంశాలను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను, నేతలను పోలీసులు అరెస్టు చేసి ఆపై విడుదల చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!