ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

హోంమంత్రికి Delhi నుంచి పిలుపు

ABN, First Publish Date - 2022-05-13T17:18:00+05:30

రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఢిల్లీ రావాలని అరగకు అధిష్టానం పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. దీంతో అరగ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                        - ‘ఆరగ’ మంత్రి పదవిపై సందిగ్ధం..!


బెంగళూరు: రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఢిల్లీ రావాలని అరగకు అధిష్టానం పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. దీంతో అరగ జ్ఞానేంద్రకు మంత్రి సందిగ్ధమనే పరిస్థితి ఏర్పడినట్లు చర్చలు సాగుతున్నాయి. హోంమంత్రిగా ఆరగ జ్ఞానేంద్ర బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. దీనికి తోడు మంత్రి కూడా ఒకటి రెండు సందర్భాలలో నోరు జారిన సందర్భాలు లేక పోలేదు. సున్నితమైన అంశాలను నిర్వహించే సందర్భంలో తప్పిదాలు చేస్తున్నారని తద్వారా పార్టీకి సమస్య తలెత్తుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులే కాకుండా సొంతపార్టీకి చెందినవారు మంత్రి తీరు పై మండిపడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఢిల్లీలో రెండురోజుల పాటు గడిపిన సందర్భంగా పలువురు ముఖ్యనేతలను కలిశారు. రాష్ట్రంలో శాంతిభధ్రతలు, ఇతరత్రా అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం బొమ్మై ఢిల్లీ పర్యటన ముగించుకుని బెంగళూరుకు రాక ముందే హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రకు పిలుపు రావడం కుతూహలమనిపిస్తోంది. ఢిల్లీ నేతలు కేవలం అక్షింతలతోనే సరిపెడతారా లేక ఏకంగా మంత్రి స్థానం నుంచి తొలగిస్తారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాత్రం ఢిల్లీ వెళ్ళి వచ్చానని అధిష్టానంకు చెందిన పెద్దలు ఎవరినీ కలువలేదని సొంత పనుల నిమిత్తం మాత్రమే వచ్చినట్లు గురువారం సాయంత్రం బెంగళూరులో ప్రకటించారు. అయితే రెండు మూడు రోజులలోనే భారీ మార్పులనే సంకేతాలకు అనుగుణంగా జ్ఞానేంద్ర ఉంటారా లేదా అనేది తేలనుంది. మార్పులు తప్పవనే సంకేతాలపై అధిష్టానం పిలుపులకు వెళ్లి వస్తున్న సీఎం, హోంమంత్రిలపై జోరుగా చర్చలు మొదలయ్యాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!