వైష్ణోదేవి భక్తుల బస్సుకు మంటలు
ABN , First Publish Date - 2022-05-14T08:17:34+05:30 IST
జమ్మూ-కశ్మీర్లో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బస్సుకు నిప్పంటుకోవడంతో నలుగురు మరణించగా 22 మంది తీవ్రంగా
నలుగురి మృతి, 22 మందికి తీవ్రగాయాలు
శ్రీనగర్, మే 13: జమ్మూ-కశ్మీర్లో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బస్సుకు నిప్పంటుకోవడంతో నలుగురు మరణించగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని వారంతా మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శన కోసం వెళ్తున్న భక్తులే. కాట్రాలోని బేస్ క్యాంపు వద్దకు వెళ్తుండగా, అక్కడి శని దేవుని మందిరం వద్ద ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. ఇందుకుగల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని స్థానికుల సాయంతో మంటలు ఆర్పారు.విద్రోహ చర్య కారణం కావొచ్చన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను జమ్మూలోని నారాయణ ఆస్పత్రికి తరలించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు.

