ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

6 లక్షల హెక్టార్ల అటవీ భూమి రెవెన్యూకు బదిలీ: మంత్రి

ABN, First Publish Date - 2022-05-06T18:36:37+05:30

రాష్ట్రంలో అటవీ శాఖ అధీనంలో ఉన్న 6 లక్షల హెక్టార్ల డీమ్డ్‌ భూమిని రెవెన్యూశాఖకు బ దిలీ చేయనున్నారు. ఇలా రెవెన్యూ శాఖకు వచ్చే ఈ భూమిలో ఇప్పటికే సాగుచేసుకుంటున్నవారిని

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 బెంగళూరు: రాష్ట్రంలో అటవీ శాఖ అధీనంలో ఉన్న 6 లక్షల హెక్టార్ల డీమ్డ్‌ భూమిని రెవెన్యూశాఖకు బదిలీ చేయనున్నారు. ఇలా రెవెన్యూ శాఖకు వచ్చే ఈ భూమిలో ఇప్పటికే సాగుచేసుకుంటున్నవారిని క్రమబద్ధీకరించి మిగిలిన భూమిని ప్రజోపయోగ కార్యక్రమాలకోసం వినియోగించనున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖా మంత్రి ఆర్‌ అశోక్‌ నగరంలో గురువారం మీడియాకు తెలియజేశారు. అటవీ శాఖ భూమి అందుబాటులోకి వస్తే మైసూరు, చామరాజనగర, శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ జిల్లాలలో సహా పలు జిల్లాల్లో సుదీర్ఘకాలంగా సాగుతున్న బగర్‌ హుకుం సమస్యకు శాస్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కొడగు జిల్లాలో 12వేల ఎకరాలు, హాసన్‌లో 30వేల ఎకరాలు, చిక్కమగళూరు జిల్లాలో 45వేల ఎకరాల  అటవీ భూములు కబ్జాకు గురయ్యాయని రైతులు ఈ భూముల్లో కాఫీ, యాలకలు, మిరియాల పంటలను పండించుకుంటున్నారని మంత్రి వివరించారు. రైతులు సాగు చేసుకుంటున్న ఈ అటవీ భూముల్ని 30 సంవత్సరాల సమ యానికి లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీరిలో 80 శాతం మంది 5 ఎకరాల కంటే తక్కువ భూమిని కబ్జా చేసినట్లు గుర్తించామన్నారు. ఇంతవరకు ఉచితంగా ఈ భూముల్లో పంటలు పండించుకున్న రైతులు ఇకపై ప్రభుత్వానికి లీజు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ లీజు మొత్తం చెల్లించే స్థోమత లేని నిరుపేద రైతుల విషయంలో ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!