ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పీయూ దాకా ఉచిత విద్య

ABN, First Publish Date - 2022-05-06T17:17:06+05:30

రాష్ట్రంలో జేడీఎస్‌ 2023లో అధికారంలోకి వస్తే ఎల్‌కేజీ నుంచి పీయూ దాకా ఉచిత విద్య అందిస్తామని మాజీ సీఎం కుమారస్వామి హామీ ఇచ్చారు. తుమకూరు, బెంగళూరులలో గురువారం జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- జేడీఎస్‌ అధికారంలోకి వస్తే నెరవేరుస్తాం

- మాజీ సీఎం కుమార స్వామి హామీ


బెంగళూరు: రాష్ట్రంలో జేడీఎస్‌ 2023లో అధికారంలోకి వస్తే ఎల్‌కేజీ నుంచి పీయూ దాకా ఉచిత విద్య అందిస్తామని మాజీ సీఎం కుమారస్వామి హామీ ఇచ్చారు. తుమకూరు, బెంగళూరులలో గురువారం జరిగిన పలు కార్యక్రమాలలో కుమారస్వామి మాట్లాడారు. బెంగళూరు పార్టీ కార్యాలయంలో బీజేపీకి చెందిన బెంగళూరు మహానగర పాలిక మాజీ మేయర్‌ శారదమ్మ జేడీఎస్ లో చేరారు. దాసరహళ్ళి నియోజక వర్గానికి చెందిన బీజేపీ ముఖ్యులు గోపాలకృష్ణ, పద్మావతి, నరసింహమూర్తి, హనుమంతప్ప, సరోజమ్మలు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు. ప్రజాసమస్యలపై ఎవరు నిరంతరంగా పనిచేస్తారో అటువంటి వారికే టికెట్‌లు ఇస్తామన్నారు. కాగా సాయంత్రం తుమకూరు జిల్లా శిరా తాలూకాలో జనతా జలధారా కార్యక్రమంలో పాల్గొన్న కుమారస్వామి మాట్లాడుతూ మరోసారి ముఖ్యమంత్రి కావాలని జనతా జలధార చేయడం లేదన్నారు. ఇప్పటికే స్పష్టమైన మెజార్టీ సీట్లు రాకున్నా కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యానన్నారు. రాష్ట్రంలో శాశ్వత సాగునీరు అమలు చేయాలనేది నా సంకల్పమన్నారు. ఏడున్నర దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రానికి సాగునీరు సమకూర్చడంలో విఫలయ్యారన్నారు. రాష్ట్రానికి శాశ్వత సాగునీరు సమకూర్చాలనేది మాజీ ప్రధాని దేవేగౌడ సంకల్పంగా భావించారన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో జేడీఎస్ కు స్పష్టమైన మెజారిటీ లభిస్తే ఎల్‌కేజీ నుంచి పీయూ దాకా ఉచిత విద్యను అందిస్తామని, ఉచిత వైద్యం అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలోను ఇరువురు డాక్టర్‌లు నిరంతరంగా ఉండేలా పథకం రూపొందిస్తామన్నారు. జేడీఎస్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తద్వారా ప్రజాసమస్యలు తీర్చుకునేందుకు వీలుంటందన్నారు. ప్రజా సంక్షేమమే తమ పార్టీ ధ్యేయమన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!