ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పీఎస్‌ఐ స్కాంలో మంత్రి సోదరుడు: కేపీసీసీ చీఫ్ డీకే

ABN, First Publish Date - 2022-05-03T00:31:17+05:30

నాకు అందిన సమాచారం ప్రకారం.. మంత్రి సోదరుడు లేదంటే వేరే బంధువుకి పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో ప్రేమయం ఉంది. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. కానీ మాంద్యాలోని ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ రిక్రూట్‌మెంట్‌లో అర్హత సాధించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బెంగళూరు: పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రి సీఎన్ అసవత్ నారాయణ్ బంధువు ప్రమేయం ఉన్నట్లు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. ముగ్గురు వ్యక్తుల నుంచి అతడికి డబ్బు అందిందని, ఒకే గ్రామానికి చెందిన ఈ ముగ్గురి గురించి వారి గ్రామంలో ఇదే మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ విషయమై తనకు ఫోన్లు వస్తున్నాయని చెప్పిన ఆయన.. మంత్రి పేరు వెళ్లడించవద్దని కొందరు తనతో ప్రాధేయపడ్డట్లు చెప్పుకొచ్చారు. ఈ స్కాంపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.


సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘నాకు అందిన సమాచారం ప్రకారం.. మంత్రి సోదరుడు లేదంటే వేరే బంధువుకి పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో ప్రేమయం ఉంది. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. కానీ మాంద్యాలోని ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ రిక్రూట్‌మెంట్‌లో అర్హత సాధించారు. వీరు ముగ్గురూ లంచం ఇవ్వడానికి తమ ఆస్తులను అమ్ముకున్నారు. వారి గ్రామస్తులంతా ఇదే విషయమై చర్చిస్తున్నారు’’ అని అన్నారు. ఇక ఈ స్కాంపై దర్యాప్తు విషయంలో సీఐడీ ఎంత నిజాయితీగా, సీరియస్‌గా పని చేస్తుందో చూడాలంటూ డీకే వ్యంగ్యంగా స్పందించారు.


వాస్తవానికి పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ రద్దైంది. స్కాంలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించకుండా ఉండేందుకు దర్యాప్తు పూర్తికాకముందే పరీక్షను రద్దు చేశారని డీకే మండిపడ్డారు. ఇది చట్టపరమైన చర్యలను అడ్డుకుంటుదని, రిక్రూట్‌మెంట్‌లో నిరవధిక జాప్యాన్ని సృష్టిస్తుందని ఆయన అన్నారు. దీని ద్వారా నిజాయితీ గల అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వ చర్యలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని డీకే విమర్శించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!