ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘తాజ్‌మహల్‌’లో విగ్రహాలు లేవు: పురావస్తు శాఖ

ABN, First Publish Date - 2022-05-14T08:19:24+05:30

తాజ్‌మహల్‌లోని గదులకు శాశ్వతంగా తాళాలు వేయలేదని, ఆ గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవని భారత పురావస్తు శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆగ్రా, మే 13: తాజ్‌మహల్‌లోని గదులకు శాశ్వతంగా తాళాలు వేయలేదని, ఆ గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు తెలిపారు. గదులకు మూడు నెలల కిందటే రిపేర్లు చేశామన్నారు. గోడలపై చిన్నచిన్న పగుళ్లను పూడ్చటంతోపాటు రీప్లాస్టరింగ్‌, కన్జర్వేషన్‌ పనులు జరిగాయని ఏఎ్‌సఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. తాజ్‌మహల్‌లోని 22 గదులను శాశ్వతంగా మూసేశారని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి చర్యలు చేపట్టేలా ఏఎ్‌సఐని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. కాగా... దీనిపై ఏఎ్‌సఐ అధికారులు స్పందించారు. తాజ్‌మహల్‌ బేస్‌మెంట్‌లో ఉన్న గదులను ఇటీవలే తెరిచామని తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను పరిశీలించామని, తాజ్‌మహల్‌ గదుల్లో విగ్రహాలు ఉన్నట్టు ఎక్కడా ప్రస్తావన లేదని పేర్కొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!