ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తగ్గుతున్న సంతాన సాఫల్య రేటు

ABN, First Publish Date - 2022-05-07T08:21:15+05:30

దేశంలో సంపూర్ణ సంతాన సాఫల్య రేటు తగ్గుతోందని ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21)లో వెల్లడైంది. 2015-16లో నిర్వహించిన నాలుగో సర్వేతో పోలిస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

దేశ మహిళల్లో మద్యం తాగేవారు 1 శాతం

గర్భనిరోధక సాధనాల వాడకం స్త్రీల విషయం..అని భావించే పురుషులు దేశంలో 35.1శాతం

‘జాతీయ కుటుంబ’ సర్వేలో ఆసక్తికర విశేషాలు


న్యూఢిల్లీ, మే 6: దేశంలో సంపూర్ణ సంతాన సాఫల్య రేటు తగ్గుతోందని ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21)లో వెల్లడైంది. 2015-16లో నిర్వహించిన నాలుగో సర్వేతో పోలిస్తే.. సంపూర్ణ సంతాన సాఫల్య రేటు (ఒక మహిళ సగటున కనే పిల్లల సంఖ్య) 2.2 నుంచి 2కు తగ్గిపోయింది. తరాలు మారినా జనసంఖ్యలో పెద్దగా తేడాలు రాకుండా ఉండాలంటే.. అందుకు ‘రీప్లే్‌సమెంట్‌ లెవెల్‌ ఆఫ్‌ ఫెర్టిలిటీ రేటు’ కీలకం. అది మనదేశంలో 2.1గా ఉంది. అంటే సగటున ప్రతి మహిళా 2.1 మంది పిల్లలకు జన్మనిస్తే జనసంఖ్యలో పెద్దగా తేడాలుండవు. బిహార్‌ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్‌ (2.35), ఝార్ఖండ్‌ (2.26), మణిపూర్‌ (2.17)లో మాత్రమే సంతాన సాఫల్యత రేటు రీప్లే్‌సమెంట్‌ లెవల్‌ కన్నా ఎక్కువగా ఉంది. 

ఇక.. 2015-16తో పోలిస్తే ఆస్పత్రుల్లో జననాల సంఖ్య 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. ఆస్పత్రుల్లో ప్రసవాలు గ్రామీణ ప్రాంతాల్లో 87ు ఉండగా.. పట్టణాలు, నగరాల్లో 94 శాతం ఉన్నాయి. ఇక.. ఊబకాయంతో బాధపడే మహిళల సంఖ్య 2015-16లో 21 శాతంగా ఉండగా ఈ సర్వేలో 24 శాతానికి పెరిగింది. పురుషుల సంఖ్య సైతం 19 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. ఇంకా ఈ సర్వేలో వెల్లడైన మరికొన్ని ముఖ్యాంశాలు..


 వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేసుకున్న మహిళల సంఖ్య పశ్చిమబెంగాల్‌లో ఎక్కువగా (42శాతం) ఉన్నట్టు సర్వేలో తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్‌(40శాతం), త్రిపుర(39శాతం), ఝార్ఖండ్‌ (35శాతం), ఆంధ్రప్రదేశ్‌(33శాతం) ఉన్నాయి. 

 15-19 ఏళ్ల వయసులో గర్భం దాల్చినవారిలో ముస్లిం మహిళల సంఖ్య(8శాతం)ఎక్కువగా ఉంది.

 దేశంలోని మహిళల్లో మద్యపానం అలవాటు ఉన్నవారి సంఖ్య 1శాతం కాగా.. పురుషుల్లో ఆ అలవాటు 22శాతం మందికి ఉంది. 

 మద్యపానం చేసే స్త్రీలలో 17 శాతం మంది నిత్యం మందు తాగేవారే కాగా.. 37శాతం మంది వారానికొకసారి తాగుతున్నారు. పురుషుల్లో 15శాతం మంది రోజూ, 43శాతం వారానికొకసారి తాగుతున్నారు.

 మద్యపానం చేసే మహిళలు అత్యధికంగా అరుణాచల్‌ప్రదేశ్‌ (18శాతం) ఉన్నారు.

 గర్భనిరోధక సాధనాలు వాడడం మహిళలకు సంబంధించిన విషయమని.. దాంతో తమకు సంబంధం లేదని 35.1ు మంది పురుషులు భావిస్తున్నారు. వాటి వాడకం వల్ల మహిళల్లో విశృంఖలత్వం పెరుగుతుందని 19.6శాతం మంది భావిస్తున్నారు. వాటి వాడకం మహిళల పని అనుకుంటున్నవారిలో ఎక్కువ మంది (69శాతం) చండీగఢ్‌లో ఉన్నారు. వాటి వల్ల మహిళల్లో విశృంఖలత్వం పెరుగుతుందనుకుని భావిస్తున్నవారు (44.1శాతం) కేరళలో ఎక్కువగా ఉన్నారు.


సర్వే ఇలా..

దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో 6.37 లక్షల కుటుంబాల్లో ఈ సర్వే చేశారు. మొత్తం 7,24,115 మంది మహిళలను, 1,01,839 మంది పురుషులను ప్రశ్నించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!