CPI ఎంపీ అల్లుడికి BJP జిల్లా అధ్యక్ష పదవి
ABN , First Publish Date - 2022-05-04T16:53:30+05:30 IST
సీపీఐ ఎంపీ సెల్వరాజన్ అక్క కుమారుడు భాస్కర్ తిరువారూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా అన్నామలై ఉత్తర్వులు జారీ

పెరంబూర్(చెన్నై): సీపీఐ ఎంపీ సెల్వరాజన్ అక్క కుమారుడు భాస్కర్ తిరువారూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా అన్నామలై ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భాస్కర్ సీపీఐ నాగపట్టణం ఎంపీ సెల్వరాజన్ అక్క కుమారుడు. భాస్కర్ తండ్రి శంకరన్ కూత్తానల్లూర్ పట్టణ పంచాయతీ కమ్యూ నిస్ట్ కౌన్సిలర్‌గా వ్యవహరి స్తున్నారు. అయినా తన సోదరుడు శివ రామన్ ద్వారా పాఠశాలలో చదువు తున్న రోజుల్లోనే ఆర్ఎస్ఎస్లో చేరిన భాస్కర్, 1997 నుంచి ఇరవై ఏళ్లు ఆ సంస్థ ఫుల్ టైం సభ్యుడుగా పనిచేశాడు. 2008లో దిండు గల్ జిల్లా ఆర్ఎస్ఎస్ ఇన్చార్జిగా ఉన్న సమయంలో ఆయనపై దాడి జరి గింది. ఈ దాడిలో ఆయన ఒక కాలు పోగోటు ్టకున్నారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన కొద్ది రోజుల క్రితం తిరువారూరు జిల్లా ప్రధాన కార్య దర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయనను జిల్లా అధ్యక్ష పదవి వరించింది.