moving train నుంచి కింద పడిన మహిళ...కాపాడిన కానిస్టేబుల్
ABN , First Publish Date - 2022-05-12T12:47:36+05:30 IST
కదులుతున్న రైలు నుంచి జారిపడిన మహిళను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ కాపాడిన ఘటన...

భువనేశ్వర్(ఒడిశా): కదులుతున్న రైలు నుంచి జారిపడిన మహిళను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ కాపాడిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరిగింది.ఈ ఘటన రైల్వే స్టేషన్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 18444 నంబరు పలాస-కటక్ ఎక్స్‌ప్రెస్ రైలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లోకి వస్తుండగా ఓ మహిళా ప్రయాణికురాలు రైలు నుంచి కింద పడిపోయింది. కిందపడిన మహిళ ప్లాట్‌ఫారమ్, కదులుతున్న రైలు మధ్య గ్యాప్‌లో జారిపోతుండగా ప్లాట్‌ఫారమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ ముండా ఆమెను రక్షించాడు.కానిస్టేబుల్ ముండా వెంటనే మహిళ వద్దకు పరిగెత్తి ఆమెను సురక్షితంగా లాగాడు.అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ (రైల్వే) సుధాన్షు సారంగి కానిస్టేబుల్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ముండాను అందరూ ప్రశంసించారు.