ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Congress Chintan Shivir : ఒక పార్టీ, ఒకే టికెట్ నిబంధనపై ఏకాభిప్రాయం!

ABN, First Publish Date - 2022-05-13T17:41:30+05:30

మేధోమథనం తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున సంస్థాగత

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : మేధోమథనం తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున సంస్థాగత మార్పులు జరుగుతాయని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ చెప్పారు. ‘ఒక పార్టీ, ఒకే టికెట్’ నిబంధనపై పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం ఉందని చెప్పారు. రాజస్థాన్‌ (Rajastan)లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మేధోమథనం మూడు రోజులపాటు  జరుగుతుందన్న సంగతి తెలిసిందే. 


ఈ మేధోమథనం ప్రారంభమవడానికి ముందు అజయ్ మాకెన్ (Ajay Maken) మాట్లాడుతూ, ఒక పార్టీ, ఒకే టికెట్ నిబంధనపై కాంగ్రెస్‌ (Congress)లో పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. మేధోమథనం (Chintan Shivir) అనంతరం పార్టీలో పెద్ద ఎత్తున సంస్థాగత మార్పులు ఉంటాయని హామీ ఇచ్చారు. పార్టీ నేతల బంధువులు  పార్టీ కోసం పని చేయకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు  టిక్కెట్లు పొందరాదని, కనీసం ఐదేళ్ళపాటు పార్టీ కోసం పని చేయనివారికి టిక్కెట్లు ఇవ్వరాదని చేసిన ప్రతిపాదనకు కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారని చెప్పారు. ఏదైనా పదవిని నిరంతరాయంగా నిర్వహించే నాయకుడు ఆ పదవి నుంచి వైదొలగాలని, మళ్లీ అదే పదవిని చేపట్టడానికి కనీసం మూడేళ్ళ విరామం ఉండాలని చెప్పారు. 


ఉదయ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ మేధోమథనానికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), ఇతర సీనియర్ నేతలు హాజరవుతారు. 2024ల జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాన్ని ఈ ‘నవ సంకల్ప చింతన్ శిబిరం’లో చర్చిస్తారు. ప్రజలను ఓ పక్షంవైపు కేంద్రీకరించే (Polarisation) వ్యూహాలతో కూడిన రాజకీయాలు, రానున్న ఎన్నికల సవాళ్ళకు సిద్ధమవడం గురించి చర్చిస్తారు. సోనియా గాంధీ ప్రసంగంతో శుక్రవారం మధ్యాహ్నం ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాజకీయాలు, పార్టీ Organisation, ఆర్థిక వ్యవస్థ, సాంఘిక సంక్షేమం, యువత, వ్యవసాయంపై చర్చలు జరుపుతారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!