ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రౌడీలపై ఉక్కుపాదం

ABN, First Publish Date - 2022-05-10T18:01:01+05:30

రాష్ట్రంలో రౌడీయిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా రౌడీల వేట కొనసాగుతుందని ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ హెచ్చరిక

చెన్నై: రాష్ట్రంలో రౌడీయిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా రౌడీల వేట కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. శాసనసభలో సోమవారం పోలీసుశాఖ ఆర్థిక పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. హోంశాఖను కూడా నిర్వర్తిస్తున్న తాను రాష్ట్రంలో శాంతి భద్రతలకే అధిక ప్రాధాన్యతినిస్తున్నానని, ముఖ్యంగా రౌడీయిజాన్ని రూపు మాపే దిశగా రౌడీల ఏరివేత కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆయా పోలీసుస్టేషన్లలో నమోదైన రౌడీ షీటర్ల జాబితాను పరిశీలించి వారిని అరెస్టు చేసి జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సహా ఉన్నత పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చానని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలో మహిళలపై, అత్యాచారాలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సోచట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలి స్తున్నామని, ఈ యేడాది నమోదైన 723 పోక్సో కేసుల్లో 86 కేసుల్లో ముద్దాయిలకు శిక్ష పడిందని వివరించారు.


నేరాల సంఖ్యను తగ్గించే దిశగా పోలీసుశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు. అన్ని విభాగాల్లో డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టామని, సీసీ కెమెరా లను అధిక సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు, లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలు సులువగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ కూడా ప్రవేశపెట్టామని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తున్నారని, వాటిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతినెలా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో రహదారి భద్రతపై సమావేశాలు జరపాలని కూడా తాను ఆదేశాలు జారీ చేశానని చెప్పారు. పోలీసుస్టేషన్లలో పేరుకుపోయిన పాత నేరాలకు సంబంధించిన పైళ్ల దుమ్ముదులుపుతున్నామని పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటిపై ఈ యేడాదిలోపు విచారణ జరిపి ముగించాలని కూడా ఆదేశించినట్టు తెలిపారు. విగ్రహాల అక్రమరవాణా నిరోధక చర్యలలోనూ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ఇప్పటివరకు చోరీకి  గురైన, అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న సుమారు 330 పంచలోహ, ప్రాచీన విగ్రహాలను కూడా స్వాధీనం చేసుకుని, నేరస్థులను జైలుకు పంపినట్లు తెలిపారు.


విగ్రహాల అక్రమ రవాణాను అరికట్టే దిశగా విగ్రహాల నిరోధక పోలీసు శాఖ, దేవాదాయ శాఖ, పురావస్తు పరిశోధన శా ఖలతో ప్రత్యేక ఉన్నతస్థాయి సమీక్షా కమిటీని కూడా ఏర్పాటు చేశామని స్టాలిన్‌ తెలిపారు. ఇదిలా వుండగా శాసనసభలో పోలీసు, అగ్నిమాపక, ఎక్సైజ్‌ శాఖకు సంబంధించిన ఆర్థిక ప ద్దులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమ వుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ను డీజీపీ శైలేం ద్రబాబు, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్కే ప్రభాకర్‌, ఏడీజీపీ షకీల్‌ అఖ్తర్‌ తదితరులు కలుసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!