ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆపన్నహస్తం అందిద్దాం.. ఆసరాగా నిలవండి

ABN, First Publish Date - 2022-05-04T13:50:50+05:30

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆపన్నహస్తం అందించేందుకు అందరూ ఆసరగా నిలవాలని, అక్కడి ప్రజలను ఆదుకునేందుకు భారీగా విరాళాలివ్వా లంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

             - శ్రీలంకను ఆదుకునేందుకు భారీగా విరాళాలివ్వండి

             - Cm Stalin పిలుపు


చెన్నై: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆపన్నహస్తం అందించేందుకు అందరూ ఆసరగా నిలవాలని, అక్కడి ప్రజలను ఆదుకునేందుకు భారీగా విరాళాలివ్వా లంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓప్రకటన విడుదల చేశారు. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో అవస్థలు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతున్నదని, ఆ మేరకుఆహారం,నిత్యావసర వస్తువులు, మందులను పంపిణీ చేయనున్నట్లు శాసనసభలో ప్రకటించానని, ఈ సహాయాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిచ్చిందని తెలిపారు. తొలివిడతగా రాష్ట్రం నుంచి 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల పాలపొడి, మందులను శ్రీలంకకు పంపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న శ్రీలంక ప్రజలను ఆదుకునే దిశగా మానవతా భావంతో దయాగుణం కలిగిన దాతలు, ప్రజ లు భారీగా విరాళాలను అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విరాళాలతో శ్రీలంక ప్రజలకు అవసరమైన నిత్యావసరవస్తువులను కొనుగోలు చేసి పంపనున్నట్లు తెలిపారు. నగదు రూపంలో విరాళాలను ‘ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెక్రటేరియట్‌ బ్రాంచి, పొదుపు ఖాతా నెంబర్‌ 117201000000070లో ఐఎఫ్ఎస్సీ ఐఓబీఏ0001172 ద్వారా జమచేయవచ్చునని తెలిపారు.  చెక్కులు, డ్రాఫ్టుల రూపంలో విరాళాలు పంపదలచినవారు ‘ది జాయింట్‌ సెక్రటరీ టు గవర్నమెంట్‌ అండ్‌ ట్రెజరర్‌, చీఫ్‌ మినిస్టర్స్‌ పబ్లిక్‌ రిలీఫ్‌ ఫండ్‌, ఫైనాన్స్‌ (సీఎంపీఆర్‌ఎఫ్‌), డిపార్ట్‌మెంట్‌, సెక్రటేరియట్‌, చెన్నై -600009’ పేరిట పంపాలనిపేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల ద్వారా చెక్కులు, డ్రాఫ్టుల రూపంలో విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపవచ్చునని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇచ్చినవారు 80-జి ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు పొందటానికి వీలుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!