ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అవార్డులు బాధ్యతను పెంచుతాయి

ABN, First Publish Date - 2022-05-12T13:48:01+05:30

అవార్డులు ప్రజాప్రతినిధుల బాధ్యతను మరింత పెంచుతాయని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ అవార్డులు సొంతం చేసుకున్న 12 మంది పంచాయతీ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                  - పంచాయతీ చైర్మన్లకు సీఎం అభినందన


ప్యారీస్‌(చెన్నై): అవార్డులు ప్రజాప్రతినిధుల బాధ్యతను మరింత పెంచుతాయని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ అవార్డులు సొంతం చేసుకున్న 12 మంది పంచాయతీ చైర్మన్లను సీఎం స్టాలిన్‌ బుధవారం అభినందించారు. ప్రతి ఏడాది జాతీయస్థాయిలో అభివృద్ధిలో ముందుండి ఉత్తమ సేవలందించే గ్రామ, ప్రాంతీయ, జిల్లా పంచాయతీలను ఎంపిక చేసి కేంద్రప్రభుత్వం పురస్కారాలు అందజేస్తోంది. ఆ ప్రకారం, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ అవార్డులకు రాష్ట్రంలోని 12 పంచాయతీలు ఎంపికయ్యాయి. తిరువణ్ణామలై, తిరుచ్చి, రామనాధపురం, దిండుగల్‌, కరూర్‌ మదురై, కన్నియాకుమారి, కృష్ణగిరి, పుదుకోట జిల్లాల్లోని పంచాయతీలు ఉత్తమ పురస్కారాన్ని, ప్రత్యేక గ్రామసభలు నిర్వహించిన రామనాధపురం జిల్లా ఆర్‌ఎస్‌ పురం పంచాయతీ, గ్రామీణాభివృద్ధి పథకం అవార్డుకు ఎంపికైన శివగంగ జిల్లాలోని తువ్వారు గ్రామ పంచాయతీ, పిల్లల సంరక్షణ అవార్డుకు ఎంపికైన నీలగిరి జిల్లా కొథగిరి యూనియన్‌ పంచాయతీలోని కుంజప్పన్‌ జిల్లా పంచాయతీల చైర్మన్లు, యూనియన్‌ పంచాయతీ అధ్యక్షులు, గ్రామ పంచాయతీ చైర్మన్‌లను బుధవారం సచివాలయానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ వారి సేవలను ప్రశంసించారు. ఇలాంటి పురస్కారాలు పొందేందుకు అన్ని గ్రామ పంచాయతీ పాలక మండళ్లు, అధికారులు కృషిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  కేఆర్‌ పెరియకరుప్పన్‌, ప్రభుత్వ ప్రధాన కార్శదరి డా.ఇరైఅన్బు, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అముద, డైరెక్టర్‌ ప్రవీణ్‌నాయర్‌ తదితరులు  పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!