ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MNREGS : గ్రామీణ ఉపాధి హామీ పథకానికి త్వరలో కొత్త రూపం!

ABN, First Publish Date - 2022-11-26T20:17:33+05:30

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGS)ని మరింత మెరుగ్గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

NREGS
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGS)ని మరింత మెరుగ్గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పేదరిక నిర్మూలనకు ఈ పథకం మరింత సమర్థంగా ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నిస్తోంది. ఈ పథకాన్ని సమీక్షించి, తగిన సలహాలు ఇవ్వడం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును సమీక్షించేందుకు అమర్‌జీత్ సిన్హా నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం క్రింద ఖర్చవుతున్న నిధులు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఖర్చవడానికి కారణాలేమిటి? అనే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఉపాధి అవకాశాలను రీడిజైన్ కూడా చేస్తుందని తెలిపారు. నిధులను మరింత సమర్థంగా వినియోగించడం కోసం అవసరమైన సిఫారసులను కూడా చేస్తుందన్నారు. పరిపాలన, అధికార యంత్రాంగం పని చేయవలసిన అంశాలపై కూడా సిఫారసులు చేస్తుందని చెప్పారు. ఈ కమిటీ నివేదికను మూడు నెలల్లోగా సమర్పిస్తుందన్నారు.

ప్రభుత్వం 2021-22లో ఈ పథకం క్రింద రూ.98 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 73 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.10 లక్షల కోట్లను ఖర్చు చేసింది. కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులను గ్రామీణులు తట్టుకునేందుకు భారీగా ఖర్చు చేసింది.

ఇదిలావుండగా, ఈ పథకం దుర్వినియోగమవుతోందనే విమర్శలు ఉన్నాయి. గ్రామీణ ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉండటంతో ఈ పథకానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ పథకం క్రింద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చవాలని, లక్షిత లబ్ధిదారుకు చేరాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కన్నా ఆర్థికంగా వెనుకబడిన బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ పథకం క్రింద ఖర్చవుతున్న నిధులు చాలా తక్కువ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-11-26T20:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising