ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఖాళీలతో కుప్పకూలిన క్యాట్‌

ABN, First Publish Date - 2022-05-14T08:12:34+05:30

పదవులను భర్తీ చేయకపోవడంతో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌)మొత్తం కుప్పకూలిందని శుక్రవారం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. కొత్తవారిని నియమించే వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య

ప్రస్తుత సభ్యుల పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి సూచన


న్యూఢిల్లీ, మే13: పదవులను భర్తీ చేయకపోవడంతో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌)మొత్తం కుప్పకూలిందని శుక్రవారం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. కొత్తవారిని నియమించే వరకు ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలాన్ని తాత్కాలికంగా పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘‘మొత్తం ట్రైబ్యునల్‌ బెంచ్‌లకు 69 సభ్యుల  పోస్టులను కేటాయించగా ప్రస్తుతం 27 మందే ఉ న్నారు. ఒక ఛైర్మన్‌, మరో 42 మంది సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. కొత్తవారిని నియమించడం లేదు. మిగిలిన ఆ 27 మంది కూడా పదవీ విరమణ చేస్తే మొత్తం ట్రైబ్యునల్‌ కుప్పకూలుతుంది’’ అని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలాన్ని పొడిగించాలని ఆదేశించింది. అడ్మినిస్ర్టేటివ్‌, జ్యుడీషియల్‌ సభ్యులు రిటైరైన తరువాత వారి సమ్మతి తీసుకొని పదవీ కాలాన్ని పొడిగించాలని సూచించింది. కొత్త సభ్యులను నియమించే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. తదుపరి విచారణను ధర్మాసనం జులై 26కు వాయిదా వేసింది.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!