జమ్మూ సరిహద్దుల్లో Pak drone...తిప్పికొట్టిన బీఎస్ఎఫ్

ABN , First Publish Date - 2022-05-14T14:31:39+05:30 IST

జమ్మూలోని సరిహద్దుల్లో శనివారం ఎగురుతున్న పాకిస్థాన్ డ్రోన్ ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తిప్పికొట్టింది....

జమ్మూ సరిహద్దుల్లో Pak drone...తిప్పికొట్టిన బీఎస్ఎఫ్

జమ్మూ: జమ్మూలోని సరిహద్దుల్లో శనివారం ఎగురుతున్న పాకిస్థాన్ డ్రోన్ ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తిప్పికొట్టింది. పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్ శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు జమ్మూలోని అర్నియాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో కనిపించింది.దీంతో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్‌పై సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సైనికులు కాల్పులు జరిపారు.దాదాపు ఏడెనిమిది రౌండ్ల కాల్పులు జరిపామని,దీంతో డ్రోన్ తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.


Read more