ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బాలికలను తర్వాతి తరం రోల్ మోడల్స్‌గా తీర్చిదిద్దేందుకు.. ‘బోర్న్ టు షైన్’ స్కాలర్‌షిప్స్

ABN, First Publish Date - 2022-05-15T01:04:05+05:30

ప్రతిభావంతులైన వర్ధమాన బాల కళాకారుల లాంచ్ ప్యాడ్ అయిన ‘బోర్న్ టు షైన్’ కార్యక్రమంలో గివ్ ఇండియా, జీ సీఎస్ఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: ప్రతిభావంతులైన వర్ధమాన బాల కళాకారుల లాంచ్ ప్యాడ్ అయిన ‘బోర్న్ టు షైన్’ కార్యక్రమంలో గివ్ ఇండియా, జీ సీఎస్ఆర్ చేతులు కలిపాయి. భారతీయ కళారూపాల్లో యువత నైపుణ్యాన్ని గుర్తించడంతోపాటు వారు రాణించేందుకు ఉపకార వేతనాలు అందించి ప్రోత్సహించాలని నిర్ణయించాయి. భారతీయ కళారూపాలన పునరుద్ధణకు ఇదో ప్రయత్నమే కాకుండా ఉపకార వేతనాలు అందించడం ద్వారా బాలికలకు స్వయం సాధికారత అందించడమే తమ లక్ష్యమని  గివ్ ఇండియా, జీ సీఎస్ఆర్ పేర్కొన్నాయి.


దేశంలో అపారమైన టాలెంట్ ఉందని, అయితే అత్యంత అరుదుగా మాత్రమే వారు బయటకు వస్తున్నారని పేర్కొన్నాయి. ‘బోర్న్ టు షైన్’ ద్వారా అడ్డంకులను అధిగమించడంతోపాటు దేశంలో తర్వాతి తరం రోల్‌మోడల్స్‌గా ఎదగాలనే ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు యువతకు సాయపడాలన్నదే తమ లక్ష్యమని తెలిపాయి. 


ఈ సందర్భంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. బోర్న్ టు షైన్ చూపించే చొరవ ద్వారా చైల్డ్ ఆర్ట్ ప్రొడిజీల ప్రపంచంలో భారీ మార్పును తీసుకొచ్చేందుకు సాయపడుతుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. వారు రాణించడం తమకు ఎంతో సంతోషాన్ని  ఇస్తుందన్నారు.  ఒక బ్రాండ్‌గా శ్రేష్టమైనది అందించేందుకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటామని అన్నారు.


దరఖాస్తు ఇలా..

ఏదైనా ఆర్ట్ ఫామ్‌లో మాస్టరీ సాధించి, 15 ఏళ్ల లోపు బాలికలు ఈ బోర్న్ టు షైన్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి మూడేళ్లపాటు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఆరు వారాలపాటు అందుబాటులో ఉంటుంది. అన్ని భాషలు, భౌగోళిక ప్రాంతాల వారికి కూడా అందుబాటులో ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత టాప్ 30లో నిలిచిన వారికి ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. మాస్ట్రో హోదాను సాధించేందుకు ఈ ఉపకారవేతనం వారికి అందుతుంది. వర్చువల్, భౌతిక ఫార్మాట్లలో వీరిని ఎంపిక చేస్తారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!