Anna nagar టవర్‌కు నూతన సొబగులు
ABN, First Publish Date - 2022-05-14T13:26:56+05:30
స్థానిక అన్నానగర్‌లోని టవర్ పార్కు కొత్త అందాలను సంతరించుకుంది. 11 యేళ్ళ తర్వాత నగరవాసులు 135 అడుగుల ఎత్తయిన అన్నానగర్ టవర్‌పై నిలిచి నగర అందాలను
- 11 ఏళ్ల తర్వాత సందర్శకులకు అనుమతి
చెన్నై: స్థానిక అన్నానగర్‌లోని టవర్ పార్కు కొత్త అందాలను సంతరించుకుంది. 11 యేళ్ళ తర్వాత నగరవాసులు 135 అడుగుల ఎత్తయిన అన్నానగర్ టవర్‌పై నిలిచి నగర అందాలను వీక్షించనున్నారు. 20 ఏళ్ల క్రితం అన్నానగర్ టవర్ సినిమా షూటింగ్ స్పాట్‌గా ఉండేది. తెలుగు, తమిళ, హిందీ క్రైం థిల్లర్ సినిమాల ఫైటింగ్ సీన్లన్నీ ఈ టవర్‌పైనే చిత్రీకించేవారు. దీనికి తోడూ నగరవాసులు ఉదయం, సాయంత్రం ఈ టవర్ పార్కును సందర్శించటాన్ని అలవాటుగా పెట్టుకున్నారు. పార్కులో వాకింగ్‌తోపాటు టవర్‌పైకి వెళ్ళి నగరాన్ని తిలకించేవారు. స్కూలు, కళాశాల విద్యార్థులకు ఈ టవర్ పార్కు టూరిస్టు స్పాట్‌గా ఉండేది, పొరుగు రాష్ట్రాల నుంచి మహాబలిపురానికి విహారయాత్రగా వెళ్లేవారు కూడా తిరుగు ప్రయాణంలో ఈ టవర్ పార్కును తప్పకుండా సందర్శించేవారు. ఈ నేపథ్యంలో 2011లో ప్రేమ విఫలమైన ప్రేమికులు కొందరు టవర్‌పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు ఆ టవర్‌పైకి సందర్శకులను వెళ్ళకుండా కట్టుదిట్టం చేశారు. రోజూ ఆ పార్కులో వాకింగ్‌కు వెళ్లేవారంతా ఆ టవర్ వద్ద తగు భద్రతా ఏర్పాట్లు కల్పించి సందర్శనకు అనుమతించాలని కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు రూ.30లక్షలతో ఆ పార్కును మెరుగుపరిచే పనులు చేపట్టారు. ప్రత్యేకించి అన్నానగర్ టవర్‌పై మళ్ళీ సందర్శకులను అనుమతించేందుకు ఆ టవర్‌లోని ప్రతి అంతస్తులోనూ పిట్టగోడల మధ్యలో కంచెలా ఇనుప ఊచలను బిగించారు. దీంతో ఈ టవర్‌పైకి వెళ్లే కిందకు జారిపడే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం ఆ టవర్‌కు పెయింటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీనితో 11 యేళ్ల తర్వాత ఈ టవర్‌ను సందర్శించేందుకు అవకాశం లభించనుండగా త్వరలోనే దీనిని ప్రారంభించనున్నారు.