ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Israel: Reporting చేస్తుండగా Journalist ను కాల్చి చంపారు

ABN, First Publish Date - 2022-05-11T21:54:20+05:30

యుద్ధాలు, దాడులను కవర్ చేసే జర్నలిస్ట్‌లపై దాడులు చేయకూడదు. పైగా షిరీన్ ‘ప్రెస్’ అని రేడియంతో రాసి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సైతం ధరించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పులను లైవ్ ద్వారా రిపోర్ట్ చేస్తున్న సమయంలోనే ఆమెకు బుల్లెట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

జెరూసలెం: Israel, Palestine మధ్య జరుగుతున్న ఘర్షణలో Al Jazeera మీడియాకు చెందిన ఒక రిపోర్టర్ మరణించారు. సదరు జర్నలిస్ట్‌ బుధవారం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పులను కవర్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఐడీఎఫ్ దళాలు ఉద్దేశపూర్వకంగానే ఆమెపై కాల్పులు జరిపి ఆమెను కిరాతకంగా హత్య చేశాయని అల్ జజీరా ఆరోపిస్తోంది. పాలస్తీనా వాసి అయిన Shireen Abu Akleh (51) అనే మహిళ అల్ జజీరాలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలను కొంత కాలంగా అల్ జజీరా తరపున కవర్ చేస్తున్నారు. 20 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతాలను కవర్ చేస్తున్న అత్యంత ధైర్యసాహసాలు కలిగిన జర్నలిస్టుగా, అనుభవజ్ఞురాలిగా ఆమెను కొనియాడుతుంటారు. కాగా ఇందులో భాగంగానే బుధవారం రిపోర్ట్ చేస్తుండగా అక్కడ జరిగిన కాల్పుల్లో షిరీన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు.


యుద్ధాలు, దాడులను కవర్ చేసే జర్నలిస్ట్‌లపై దాడులు చేయకూడదు. పైగా షిరీన్ ‘ప్రెస్’ అని రేడియంతో రాసి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సైతం ధరించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పులను లైవ్ ద్వారా రిపోర్ట్ చేస్తున్న సమయంలోనే ఆమెకు బుల్లెట్లు తగిలాయి. కాగా, ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ దళాలు షిరీన్‌పై కాల్పులకు దిగాయని, ఆమెను కిరాతకంగా కాల్చి చంపారంటూ అల్ జజీరా ఆరోపిస్తోంది. కాగా, అల్ జజీరా వ్యాఖ్యల్ని ఖతార్ విదేశాంగ మంత్రి సమర్ధించినట్లుగా మాట్లాడారు. హెల్మెట్ ధరించిన ఆమె తలలోకి బుల్లెట్లు దిగి చనిపోయిందని, ఇదెలా జరిగిందని ప్రశ్నించారు. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలు కొట్టి పారేసింది. పాలస్తీనా సేనలే ఆమెను కాల్చి చంపి ఉంటారని అభిప్రాయపడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!