ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Hindu Idols : తాజ్ మహల్ గదులను తెరవాలి : హైకోర్టులో పిటిషన్

ABN, First Publish Date - 2022-05-08T17:04:35+05:30

ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 20 గదులను

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 20 గదులను తెరవాలని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 


Taj Mahal (తాజ్ మహల్) విషయంలో చాలా కాలం నుంచి వివాదం ఉందని డాక్టర్ రజనీశ్ చెప్పారు. ఈ కట్టడంలోని 20 గదులకు తాళాలు వేశారని, వీటిలోకి ఎవరికీ ప్రవేశం కల్పించడం లేదని చెప్పారు. వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయనే నమ్మకం ఉందని తెలిపారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ గదులను తెరవాలని ASIని ఆదేశించాలని తాను హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఈ గదులను తెరచి, వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే, వివాదాలు పరిష్కారమవుతాయని, దీనివల్ల ఎటువంటి హాని జరగబోదని అన్నారు. 


తాజ్ మహల్ మొదట్లో తేజో మహాలయ అనే హిందూ దేవాలయం అని కొందరు వాదిస్తున్న సంగతి తెలిసిందే.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!